WHAT IS ONLINE TRADING?


ట్రేడింగ్ లో రకాలున్నాయి. ఫారెక్స్ ట్రేడింగ్, స్టాక్ ట్రేడింగ్, కమోడిటీ ట్రేడింగ్ మొ.వి

ఫారెక్స్ ట్రేడింగ్ లో USD (United State Dollar), GBP (Great Briton Pound), JPY (Japan Yen) మొదలైనవి ట్రేడింగ్ జరుగుతాయి అంటే ఒక కరెన్సీని ఇంకో కరెన్సీతో కొనడం అమ్మడం ద్వారా లావాదేవీలు (ట్రేడింగ్) జరుపుకోవడం

స్టాక్ ట్రేడింగ్ అంటే  షేర్స్ కొనడం, అమ్మడం.

కమోడిటీ ట్రేడింగ్ అంటే వస్తువులు కొనడం, అమ్మడం, అంటే గోల్డ్, సిల్వర్, మెటల్స్ మొదలైనవి.

ఆన్లైన్ కమోడిటీ ట్రేడింగ్ లో కొనుగోలు, అమ్మకాలు అంటే ఇక్కడ నిజంగా భౌతికంగా కొనుక్కోవడం కాదు. ఇంటర్నెట్ ద్వారా సంబంధిత లావాదేవీలు జరిపి వ్యాపారం (Trading ) చెయ్యడం. అంటే buy ఆర్డర్, sell ఆర్డర్ ఇవ్వడం ద్వారా ఒక పొజిషన్ తీసుకుని ఆ తర్వాత లాభ / నష్టాలతో ముందున్న పొజిషన్ నుండి ఎగ్జిట్ అవ్వడం అన్నమాట. అసలు ఈ ఆన్లైన్ ట్రేడింగ్ పుట్టుపూర్వోత్తరాలు, ప్రారంభించిన తేదీలు చెప్పేటంత లోతు లోకి మనం వెళ్ళడం లేదు. బిగినర్స్ కు దీని గురించి అవగాహన కోసం మళ్ళీ ఒక్కసారి ఇక్కడ క్లుప్తంగా వివరించే ప్రయత్నం ఇది.
ACCOUNT OPENING PROCESS:

మీరు తరుచుగా వినే రూపాయి విలువ పతనం కావడం అంటే అర్ధం ఏమిటి ?








డాలర్ తో పోలిస్తే రూపాయి  విలువ తగ్గడం గురుంచి ఈ మధ్య మీరందరూ తరుచుగా వింటూనే ఉన్నారు.ఈ మధ్య డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 57.32 చేరుకోవడం మీకు తెలిసే ఉంటుంది.. అసలు రూపాయి పతనం అంటే ఏమిటో ఒక్క సారి చూద్దాం. మార్కెట్ లో ఏదైనా ఒక వస్తువు ధర పడిపోయినప్పుడు దానిని కనుగోలు చేయాలి అనుకున్న వ్యక్తీ తక్కువ ధర చేల్లిస్తాడు అనే విషయం మీకు తెలుసుకదా ? అదే విధంగా  భారత దేశంలో నివసిస్తున్న మనం రూపాయిని  కనుగోలు చేయలేము. మనం ,మనకు కావలసిన రూపాయలను జీతం ద్వారా,  మనం అందించిన సేవల ద్వారా మాత్రమే పొందగలం.కాని మీరు ఒక్కసారి ఆలోచించండి.  విదేశాల నుండి మనం దేశానికి వచ్చే టూరిస్టులు కాని, విదేశాలలో ఉన్న మన బందువులు కాని మనకు డబ్బు పంపాలి అంటే  వారూ మన దేశ రూపాయిని కనుగోలు

ఆషామాషీ గా మదుపు చేయకండి


మార్కెట్ లో లాభ సాటి షేర్లను గుర్తించి మదుపు చేస్తే  నష్ట పోయే అవకాశాలు తక్కువగా వుంటాయి అయితే లాభ సాటి షేర్లను గుర్తించడం అంతా సులభమైన విషయం కాదు. ఇక్కడే మన శక్తి సామర్ధ్యాలు బయట పడతాయి. మంచి షేర్లను గుర్తించడానికి నిరంతర పరిశీలన అవసరం. మార్కెట్ లో ప్రతి పరిణామాన్నిగమనిస్తుండాలి.ఆర్ధిక ఫలితాలను పరిశీలిస్తుండాలి.అందుకు కొంత సమయం కేటాయించాలి .ఓర్పుగా మార్కెట్ కి సంబంధించిన ప్రతి అంశాన్ని అధ్యయనం  చేయాలి.చిన్న ఇన్వెస్టర్లు సహజం గా అంతా ఓపిక చూపరు.కొందరైతే ఏమాత్రం కష్ట పడకుండా అలా మదుపు చేస్తే ఇలా లాభాలు రావాలని కోరు కుంటారు. ఆలాంటి వాళ్ళలో కొద్దిమంది లబ్ది పొందినా అధిక  భాగం

షేర్ మార్కెట్ లేదా స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి ?

షేర్ మార్కెట్ లేదా స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి ?

షేర్ అంటే వాటా లేదా భాగం అని అర్ధం. అంటే మీరు ఏదైనా ఒక కంపెనీ షేర్  కొంటున్నారు అంటే ఆ కంపెనీలో భాగం కొంటున్నారు అని అర్ధం.దీనిని  మనం ఒక ఉదాహరణ ద్వారా అర్ధం చేసుకొనే ప్రయత్నం చేద్దాం.
ఒక యువ జంట ఒక వ్యాపారం చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. వారికి మంచి రుచికరమైన , రకరకాలైన ఐస్ క్రీం లు తయారు చేయడంలో  మంచి ప్రావీణ్యం ఉంది. కాబట్టి వారూ ఐస్ క్రీం పార్లర్ ప్రారంభించారు. దానికి వారూ రోజీ ఐస్ క్రీం పార్లర్ అనే పేరు పెట్టడం జరిగినది. వారూ ఈ వ్యాపారం చేయడానికి కావలసిన డబ్బు బ్యాంక్ వద్ద అప్పు తీసుకొని ప్రారంభించడం జరిగినది. వారి వ్యాపారం వారూ అనుకున్నట్టుగానే  బాగా వృద్ది లోకి రావడం జరిగినది.మంచి లాభాలు కూడా పొందుతున్నారు. వస్తున్న లాభాలతో పెరుగుతున్న కస్టమర్లకు అనుగుణంగా  ఐస్ క్రీం లు తయారు చేయడానికి కావలసిన  మేటిరీయల్ కొనడానికి వస్తున్న లాభాలు ఉపయోగిస్తున్నారు.
స్టాక్ మార్కెట్ పరిచయం

రేపటి జీవనం ఎలాంటి ఒడిదోడుకులులేకుండా సాగాలంటే భవిష్యత్తు లో వచ్చే ఆదాయం కోసం  మనం సంపాదించిన సంపదలో మన ఖర్చులు పోగా మిగిలిన సంపదను  పెట్టుబడిగా పెట్టి మరింత సంపదను పొందడమే పెట్టుబడి . ఈ పెట్టుబడి అనునది మనం స్తిరాస్తి , బ్యాంకు డిపాజిట్లు, వడ్డీ ఆదాయం , అద్దె ఆదాయం , షేర్స్ ,మ్యూచువల్ ఫండ్స్,బాండ్స్, సేవింగ్ సర్టిఫికేట్లు, వివిధ పోస్ట్ ఆఫీసు ఫథకాలు, బంగారారం  మొదలగు వాటిలో పెడతాం .
మన పెట్టుబడి ఒక్క ముఖ్య ఉద్దేశం  సంపద సృష్టించడం , దానితో పిల్లల కళాశాల ఫీజులు. పెళ్ళిల్లు, సెలవులలో  సరదాగా  గడపడం, మంచి జీవన ప్రమాణానికి,రిటైర్మెంట్ తర్వాత జీవితం సాపీగా జరుగుటకు , మీ అనంతరం ఈ సంపద మీ తరాల వారికి  చేర్చటం.ఈ పెట్టుబడి వల్ల వచ్చే  రాబడి పెరుగుతున్న  ద్రవ్యోల్బణం  కంటే అధికంగా ఉండాలి. ఎప్పుడైనా సరే సంపదను కాపాడటం మరియు దానిని అభివృద్ధి చేయడం అనేది ఒక్క కళ.