WHAT IS ONLINE TRADING?


ట్రేడింగ్ లో రకాలున్నాయి. ఫారెక్స్ ట్రేడింగ్, స్టాక్ ట్రేడింగ్, కమోడిటీ ట్రేడింగ్ మొ.వి

ఫారెక్స్ ట్రేడింగ్ లో USD (United State Dollar), GBP (Great Briton Pound), JPY (Japan Yen) మొదలైనవి ట్రేడింగ్ జరుగుతాయి అంటే ఒక కరెన్సీని ఇంకో కరెన్సీతో కొనడం అమ్మడం ద్వారా లావాదేవీలు (ట్రేడింగ్) జరుపుకోవడం

స్టాక్ ట్రేడింగ్ అంటే  షేర్స్ కొనడం, అమ్మడం.

కమోడిటీ ట్రేడింగ్ అంటే వస్తువులు కొనడం, అమ్మడం, అంటే గోల్డ్, సిల్వర్, మెటల్స్ మొదలైనవి.

ఆన్లైన్ కమోడిటీ ట్రేడింగ్ లో కొనుగోలు, అమ్మకాలు అంటే ఇక్కడ నిజంగా భౌతికంగా కొనుక్కోవడం కాదు. ఇంటర్నెట్ ద్వారా సంబంధిత లావాదేవీలు జరిపి వ్యాపారం (Trading ) చెయ్యడం. అంటే buy ఆర్డర్, sell ఆర్డర్ ఇవ్వడం ద్వారా ఒక పొజిషన్ తీసుకుని ఆ తర్వాత లాభ / నష్టాలతో ముందున్న పొజిషన్ నుండి ఎగ్జిట్ అవ్వడం అన్నమాట. అసలు ఈ ఆన్లైన్ ట్రేడింగ్ పుట్టుపూర్వోత్తరాలు, ప్రారంభించిన తేదీలు చెప్పేటంత లోతు లోకి మనం వెళ్ళడం లేదు. బిగినర్స్ కు దీని గురించి అవగాహన కోసం మళ్ళీ ఒక్కసారి ఇక్కడ క్లుప్తంగా వివరించే ప్రయత్నం ఇది.
ACCOUNT OPENING PROCESS:



ముందు గా మనం పై ట్రేడింగ్ రకాలలో దేనిలో ట్రేడింగ్ చెయ్యాలో నిర్ణయించుకుని ( forex or currency trading, stock trading, commiditee trading) ఆ ప్రకారం ఒక బ్రోకర్ ఆఫీస్ కు వెళ్లి అక్కడ ఒక అకౌంట్ వోపెన్ చెయ్యాలి. ఒక్కొక్క బ్రోకింగ్ సంస్థ రూల్స్ ప్రకారం అన్ని ట్రేడింగ్ లకు ఒకే అకౌంట్ వోపెన్ చేసుకోవచ్చు లేదా విడివిడిగా 3 అకౌంట్స్ వోపెన్ చేసుకోవచ్చు. ఈ ట్రేడింగ్ అనేది ఇండియా లో నే కాదు ప్రపంచమంతా  ఉంది. అన్నింటికంటే కరెన్సీ ట్రేడింగ్  లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా లక్షల కోట్లలో  బిజినెస్ జరుగుతూ ఉంటుంది. మనం ఏ ట్రేడింగ్ లో నైనా నిరభ్యంతరంగా అకౌంట్ వోపెన్ చేసి ట్రేడింగ్ చేసుకోవచ్చు. 
కమోడిటీ ట్రేడింగ్ గురించి ఈ బ్లాగ్ చర్చిస్తుంది  కాబట్టి దాని గురించే చెప్పుకుందాము.
సో, బ్రోకర్ వద్ద ట్రేడింగ్ అకౌంట్ వోపెన్ చేసుకోవాలి. Share khan, Religare, Indiabulls, Appollo sindhuri, Karvy , Edlewise  లాంటి బ్రోకింగ్ సంస్థల్లో ఖాతా వోపెన్ చేసుకుని ఆ అకౌంట్ లోబాలన్స్ డిపాజిట్ చేసి మనం ట్రేడింగ్ మొదలు పెట్టుకోవాలి. ఖాతా వోపెన్ చెయ్యడానికి వారు అడిగిన, ఐడి, అడ్రస్ ప్రూఫ్ లు ఇచ్చి 3,4 రోజుల్లో అకౌంట్ ఆక్టివేట్ చేయించుకోవాలి. అలా ఆక్టివేట్ అయిన తర్వాత వారి సంస్థ ఖాతాలోనే మనం ట్రేడింగ్ చెయ్యడానికి అమౌంట్ డిపాజిట్ చెయ్యాలి. మన అమౌంట్ safe గా ఉంటుందా అంటే ప్రసిద్ద బ్రోకింగ్ సంస్థల్లో అయితే సేఫ్ గానే ఉంటుంది. చిన్న చితకా వాటిగురించి చెప్పలేము. బిచాణా ఎత్తేయచ్చు. సో మంచి కంపనీ అవునా కాదా అని ఎంక్వయిరీ చేసి అందులో అకౌంట్ వోపెన్ చెయ్యాలి 
అకౌంట్ వోపెన్ చెయ్యగానే వాళ్ళు మన కంప్యూటర్ లో ఒక ట్రేడింగ్ ప్లాట్ ఫాం లోడ్ చేస్తారు. మనకి ఒక లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఇస్తారు. ఆ software తో మనం మన ఇంట్లోనే కూర్చుని ఆన్లైన్ ట్రేడింగ్ చేసుకుంటాము. ఈ software లో ఎక్కువ పాపులర్ లో  ఉన్నవాటిలో "ODIN DIET" కూడా ఒకటి. ఈ software సాయంతోనే మనం బయ్ ఆర్డర్,  సెల్ ఆర్డర్ పెట్టుకుంటాము, అలాగే టార్గెట్ కూడా ఈ software లోనే పెట్టుకుంటాము.  ట్రేడింగ్ చెయ్యాలంటే కంపల్సరీ కంప్యూటర్ ఉండాలా అంటే అవసరం లేదు, మనం ఫోన్ చేసి కూడా బ్రోకర్ కి బయ్ ఆర్డర్, సెల్ ఆర్డర్ చెప్పవచ్చు. కాని ప్రత్యక్షంగా మనం లైవ్ prices చూస్తూ ట్రేడింగ్ చెయ్యాలంటే మనకు ఒక కంప్యూటర్ ఉంటె బెటర్. పైగా మనం బ్రోకర్ కి ఫోన్ చేసి ఆర్డర్ పెట్టమని చెప్పేలోపు ఒక్కోసారి మార్కెట్ ప్రైస్ చాల వేగంగా కదిలిపోతుంది 
INDIAN TRADING AND TIMINGS: 
మనం బంగారం కొనాలంటే షాపుకి వెళ్లి కొంటాము.ఇది నిజమైన అవసరం. కాని అవసరం లేకపోయినా బంగారం ఆన్లైన్ ద్వారా కొనడం మరియు అమ్మడం చేసి లాభ / నష్టాలు నమోదు చేసుకోవదాన్నే ట్రేడింగ్ అంటారు. బయటి మార్కెట్ రేట్లకు, ట్రేడింగ్ రేట్లకు తేడా ఏమీ ఉండదు. ఇంకా ఇక్కడే అనుక్షణం ప్రైస్ లు మారుతూ అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ఆ ధరల హెచ్చు తగ్గుల్ని మనం cash చేసుకునే ప్రయత్నమే online trading. 
కమోడిటీ ట్రేడింగ్ ఇండియా ఎక్సెంజి లో చెయ్యొచ్చు లేదా, ఫారిన్ కంపనీ లలో అకౌంట్ వోపెన్ చేసి చేసుకోవచ్చు. మనం ఇండియా కమోడిటీ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి MCX ఎక్సెంజి ద్వారా మనం ట్రేడింగ్ చెయ్యొచ్చు. ఇండియా కమోడిటీ ట్రేడింగ్ టైమింగ్స్ ఉదయం 10 గంటలకు ప్రారంభమై రాత్రి 12 గంటలకు ముగుస్తుంది. ఆదివారం, పబ్లిక్ హాలిడేస్ ట్రేడింగ్ జరగదు. శనివారం ఒక్కపూటే మద్యాహ్నం దాకే  ట్రేడింగ్ జరుగుతుంది. సాధారణంగా శనివారం ఎవరూ ట్రేడింగ్ చెయ్యరు. సో వారం లో 5 రోజులు పూర్తి ట్రేడింగ్ జరుగుతుంది 
TRADING ADVANTAGES: 
ఒకరితో పని లేకుండా మన అకౌంట్ లో బాలన్స్ మనీ పెట్టుకుని ట్రేడింగ్ చెయ్యొచ్చు. బ్రోకర్ సంస్థ వాళ్ళు ఇచ్చిన ట్రేడింగ్ ప్లాట్ ఫాం లో బంగారం, వెండి, రాగి జింక్ లాంటి లోహాలతో పాటు ఇంకా చాల రకాల స్క్రిప్స్ ఉంటాయి వాటిలో మనకు నచ్చిన వాటిమీద ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఆయా స్క్రిప్స్ రేటు తగ్గేతప్పుడు sell position తీసుకోవాలి. రేటు నిర్ణీత ధర వద్దకు తగ్గగానే మన position క్లోజ్ చేసుకోవాలి. అప్పుడు లాభం . అలాగే  రేటు పెరిగేటప్పుడు buy position తీసుకోవాలి. రేటు నిర్ణీత ధర  దగ్గరకు పెరగగానే  మన position క్లోజ్ చెయ్యాలి. అప్పుడు లాభం. అంటే తక్కువ రేటులో కొని ఎక్కువ రేటులో అమ్మడం, లేదా ఎక్కువ రేటులోఅమ్ముకుని తక్కువ రేటులో కొనుక్కోవడమే ఇందులో లాజిక్. 
రోజూ గోల్డ్, సిల్వర్ మరియు అన్ని రకాల స్క్రిప్స్ లో రెట్లు హెచ్చు తగ్గులు సంభవిస్తూ ఉంటాయి. మనం ధరలు పెరిగినా, తగ్గినా రెండు పదతుల్లోనూ ఆయా buy , sell పోజిషన్స్ తీసుకుని లాభాలు నమోదు చేసుకోవచ్చు. మనం ట్రేడింగ్ ద్వారా నమోదు చేసిన లాభం వెంటనే మన అకౌంట్ కి జమ అయిపోతుంది. మనం ఎప్పుడైనా withdraw చేసుకోవచ్చు.

కొత్తవారికి వచ్చే సందేహం ఏమిటంటే దేన్నైనా ముందు  బయ్ చేసి తర్వాత సెల్ చెయ్యాలి కదా అనుకుంటుంటారు. అయితే ఇది future trading. ఇక్కడ ముందుగా బయ్ చెయ్యాల్సిన పని లేదు. మన అకౌంట్ లో ఉన్న డబ్బుతో డైరెక్ట్ గా సెల్ లేదా బయ్ చెయ్యవచ్చు. ఇంకోలా చెప్పాలంటే ఇక్కడ రియల్ గా buy , sell కాకుండా కేవలం buy , sell పోజిషన్స్  మాత్రమె తీసుకుంటున్నాము. buy చేసిన తర్వాతా రేటు పెరిగితే లాభం తగ్గితే నష్టం. అలాగే సెల్ తర్వాతా రేటు తగ్గితే నష్టం, పెరిగితే లాభం. ఇది ఇలా చదివితే కొత్తవారికి కన్ఫ్యూజన్ గా ఉంటుంది. మీరు రియల్ ట్రేడింగ్ మొదలు పెట్టి ఈ buy , sell ఆర్డర్స్ పెట్టి లాభ నష్టాలు లైవ్ ఎలా మారుతున్నాయో చూస్తె మీకు అర్ధం అవుతుంది 
అలాగే బ్రోకర్ మన అసలు డబ్బు కంటే ఎక్కువ మార్జిన్ అవకాశాన్ని కల్పిస్తాడు.  అంటే మీరు కేవలం 50 వేల రూపాయలు పెట్టుబడితో ఒక కేజీ బంగారాన్ని ఆన్లైన్ ట్రేడింగ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తాడు. అదే నిజంగా కేజీ బంగారం రియల్ మార్కెట్ లో ట్రేడింగ్ చెయ్యాలంటే 30 లక్షలు కావాలి. ఈ మార్జిన్ మనీ వల్ల  మనకు ఉపయోగం ఏమిటంటే మనం పెట్టింది 50,000 పెట్టుబడి అయినా ఆ పెట్టుబడి 30 లక్షలు తో సమానమైన సరుకు ని కొనడానికి వెసులుబాటు కల్పిస్తుంది. అంటే మీ స్నేహితుడు ఈ రోజు ఉదయం 30 లక్షలు పెట్టి బయట మార్కెట్ లో కేజీ బంగారం కొన్నారు. కేజీ బంగారం ధర 30 లక్షలు అనుకోండి.  మీరు 50 వేల రూపాయలతో ఆన్లైన్ ట్రేడింగ్ లో అదే కేజీ బంగారం buy పోజిషన్ తీసుకున్నారు.  (ఇక్కడ ఆ అవకాసం ఉంది, దీనినే మార్జిన్ మనీ అంటారు) సాయంత్రానికి  జరిగిన లావాదేవీల్లో బంగారం ధర 30 లక్షల 50 వేలు అయింది. అంటే 50 వేలు లాభం వచ్చింది. మీ స్నేహితుడు 50 వేల లాభాన్ని నమోదు చేసుకున్నాడు. సరిగ్గా మీరు కూడా ఆన్లైన్ లో 50 వేల రూపాయల లాభాన్ని స్వంతం చేసుకుంటారు. నిజం. కేవలం 50 వేల రూపాయల పెట్టుబడితో ఒక్కరోజులో మీరు 50 వేలు సంపాదించారు. కాని మీ స్నేహితుడు  50 వేలు లాభం నమోదు చెయ్యడానికి 30 లక్షల పెట్టుబడి పెట్టాడు. రియల్ మార్కెట్ లో ఎంత లాభం వస్తుందో ఇక్కడ కూడా అంతే లాభం మన అకౌంట్ లో జమ అవుతుంది. 
నేను ఇక్కడ రోజూ ఇచ్చే బంగారం ట్రేడింగ్ కాల్స్ 10 గ్రాములకి సంబంచినది. సాయంత్రానికి ఆ ధరలో వచ్చిన హెచ్చు తగ్గులు ప్రకారం ఇక్కడ ఒక రూపాయికి 100 రూపాయలు కలుపుకోవాలి. ఉదాహరణకి సాయంత్రానికి నేను బయ్ కాల్ లో ఇచ్చిన రేటు 200 రూపాయలు పెరిగితే మనకు 20,000/- లాభం వస్తుంది. నష్టం వచ్చినా ఇదే విధంగా వస్తుంది. అంటే పై మీ స్నేహితుడి విషయంలో మీరు బంగారం కొన్న తర్వాతా రేటు తగ్గి నష్టం వస్తే మీ సొమ్ము సర్వం ఒక్క రోజులో పోతుంది, కాని మీ స్నేహితుడి కి ఆ నష్టం పెద్ద లెక్కలోకి రాదు. మీరు మళ్లీ  రేపు ఇంకో 50వేల రూపాయలు  వెతుక్కుని అకౌంట్ లో జమ చేసి ట్రేడింగ్ ప్రారంభించాలి. 
అందుకని బ్రోకర్ మార్జిన్ మనీ కి అవకాసం కల్పించాడు కదా అని తక్కువ అమౌంట్ తో పెద్ద స్క్రిప్స్ చెయ్యకూడదు. అలాంటివారి కోసం క్రూడాయిల్, మెటల్స్ ఆమోదయోగ్యంగా ఉంటాయి, వాటిలో చేసుకోవచ్చు. లేదా బంగారం లోనే చెయ్యాలనుకుంటే Gold mini, Gold petal అనే ప్రత్యెక స్క్రిప్స్ లో ట్రేడింగ్ చేసి తక్కువ లాభ నష్టాలు నమోదు చేసుకోవచ్చు. ఈ స్క్రిప్స్ లో ఒక రూపాయి తేడాకి కేవలం 10 రూపాయలు (Gold mini) , 1 రూపాయి (Gold petal) కలుపుకుని మన లాభ నష్టాలు  నమోదు అవుతాయి. 
ఈ మార్జిన్ మనీని Exposure లేదా Leverage అని కూడా అంటారు. 
కమీషన్ : మనం ప్రతి రోజు చేసే లావాదేవీల మీద కొంత శాతం కమీషన్ కింద బ్రోకర్ కి చెల్లించాలి. ఈ కమీషన్ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా వసూలు చేస్తున్నారు. మీరు లక్షలు లక్షలు పెట్టి ట్రేడింగ్ చేసేవాళ్ళు అయితే మీకు ఒక కమీషన్, చిన్న మొత్తంలో ట్రేడింగ్ చేసేవాళ్ళు   వాళ్లకు ఒక కమీషన్ ఉంటుంది. సాధారణంగా  పెద్ద కంపెనీలు ఒక కోటి రూపాయల లావాదేవీకి 2500 నుండి 3000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మామూలు కంపెనీలు 1500 నుండి 2000 వరకు ఛార్జ్ చేస్తున్నాయి. ఇక్కడ కోటి రూపాయల విలువైన లావాదేవీలు మనం చేస్తున్నామా అని మీరు ఆశ్చర్య పోవచ్చు. నిజమే చేస్తున్నాము. పైన బంగారం ఉదాహరణగా తీసుకుంటే 30 లక్షలు లావాదేవీ జరిగినట్టుగా లెక్క, మనం ఆ 30 లక్షలు మీద కమీషన్ చెల్లించాలి. అయితే ఇక్కడ కేవలం 30 లక్షలు మాత్రమె జరగలేదు. ఎంట్రీ ఒక 30 లక్షలు, ఎగ్జిట్ ఒక 30 లక్షలు అంటే 60 లక్షల వ్యాపారం చేసినట్టు. ఈ 60 లక్షల మీద మనం  బ్రోకర్ ని బట్టి సుమారు 1200 నుండి 1800 కమీషన్ చెల్లించాలి. మళ్లీ ఈ ఛార్జ్ మీద 12.5% సర్వీసు టాక్స్ ఉంటుంది. అంటే సుమారు 140/-నుండి 210/- లు. ఈ  కమీషన్, టాక్సులు తీసివేసి మన లాభం లెక్కవేసుకోవాలి. 
BOOK PROFITS IN TRADING: 
అయితే ట్రేడింగ్ లో లాభాలు సంపాదించాలంటే పలానా స్క్రిప్ పలానా రోజు, పలానా రేటు దాకా పెరుగుతుంది లేదా పలానా రేటు దాకా తగ్గుతుంది అని తెలియాలి అలా తెలిసినప్పుడు వెంటనే ఆయా స్క్రిప్స్ లో buy లేదా sell పోజిషన్ తీసుకుని దాన్ని ట్రేడింగ్ చేసి లాభాలు నమోదు చేసుకుంటాము.  కాని స్క్రిప్స్ లో  ఏది, ఎప్పుడు, ఏ రేటు దాకా వెళ్తుంది అందరికీ  తెలీదు. సో తెలిసీ తెలీకుండా ఇందులో దిగి గుడ్డిగా ట్రేడింగ్ చేసి నష్టాలు పాలౌతూ ఉంటారు. మరి ఎలా? 
మార్కెట్ గురించి పక్కా అవగాహన ఉన్న నిపుణులే 100% ఈ రోజు ఇలా జరుగుతుంది అని చెప్పలేరు. బిజినెస్ న్యూస్ చదివేటప్పుడు మార్కెట్ నిపుణులు చెప్పే చమత్కార మాటలు వినే ఉంటారు. బంగారం ఈ వారం ఇంతదాకా వెళ్ళే అవకాశం లేకపోలేదు, రాకపోదు,  తప్పక పోవచ్చు, పెరగవచ్చు, తగ్గవచ్చు ఇలాంటి పెండింగ్ పెట్టి చెప్తారు తప్ప ఎవ్వరూ పక్కాగా ఇది గ్యారంటీ అని చెప్పలేరు. టెక్నికల్ అనలిస్ట్లు మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా  బంగారం పయనం ఎలా సాగింది అనే దాన్ని స్టడీ చేసి ఇకముందు ఇలా జరగోచ్చు అని చెప్తూ ఉంటారు. (నేను ఇచ్చే కాల్స్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం తయారు చెయ్యబడ్డవి). అంటే వాళ్ళు గత చరిత్ర ఆధారంగా ధరల గ్రాఫులు పరిశీలించి ఒక అంచనాకి వచ్చి పలానా దగ్గర బయ్ లేదా సెల్ చెయ్యమని రికమండ్ చేస్తారు. ఇది కూడా అన్నివేళలా కరెక్ట్ అవుతాయని గ్యారంటీ లేదు, కాకపోతే ఎక్కువ శాతం నిజమయ్యే అవకాసం మాత్రం ఉంది. అకస్మాతుగా ఏవైనా పెద్ద పెద్ద న్యూస్ లు (దేశాధ్యక్షుడి ఎన్నిక, సునామీలు,  భూకంపాలు , యుద్దాలు, ఆర్ధికంగా దివాలా తీయడం, డాలర్ హెచ్చు తగ్గుల్లో విపరీత మార్పులు మొదలైనవి) వచ్చినప్పుడు ఈ అనాలసిస్ లు పని చెయ్యవు. ఆయా రోజుల్లో ట్రేడింగ్ చెయ్యకుండా ఉండటం ఉత్తమం. 
BEWARE OF DUPLICATE TIPS PROVIDERS
 మార్కెట్ గురించి తెలియని వాళ్ళు , టెక్నికల్ నాలెడ్జి లేని  వాళ్ళు కొంత మంది ఈ  టెక్నికల్ అనలిస్టుల మీద ఆధారపడి వారు చెప్పిన కాల్స్/ టిప్స్ పాటిస్తూ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ఈ రోజు ఇంటర్నెట్ లో MCX tips providers అని వెతికితే వందల కొద్దీ వెబ్సైట్ లు దర్శనమిస్తాయి. కాని వాళ్ళలో ఎంతమంది కాల్స్/ టిప్స్ కరెక్ట్ గా ఉన్నాయి, ఎంతమేర ఫెయిల్ అవుతూ ఉన్నాయి అనేది మనం వారి వెబ్సైట్ లో "Free trail" కింద రిజిస్టర్ అయి చెక్ చేసుకుని ఒక నిర్ధారణకి రావాలి. కాని ఎక్కువమంది 1,2 రోజులకంటే ఫ్రీ ట్రయల్స్ ఇవ్వడం లేదు. కేవలం 2 రోజుల్లో వారి సామర్ధ్యాన్ని మనం అంచనా వెయ్యలేము. చాల మంది మోసపూరితంగా ఉన్నారు. వారి వెబ్సైట్ లో "Past performance" వద్ద వారు ప్రకటించే లాభాలు నమ్మకండి. చాలామంది దొంగ లాభాలు చూపిస్తున్నారు. మనం టెంప్ట్ అయి వారికి ఫీజు కట్టి వారి టిప్స్ ట్రై చేస్తే మన పెట్టుబడి అంతా హుష్ కాకి అయిపోతుంది జాగ్రత్త !!!!! 
ఇలాంటివారి మీద కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయేమో  అని గూగిల్ లో వెతకాలి.  వాళ్ళ వెబ్సైట్ పేరు పక్కన కంప్లైంట్స్ అని టైపు చేసి సెర్చ్ బాక్స్ లో  వెతికితే ఆ వెబ్సైట్ బాధితులు ఇచ్చిన కంప్లైంట్స్ మనకి కన్పిస్తాయి.  ఆ ప్రకారం మనం కొంచెం సేఫ్ గా ఉండొచ్చు. అయితే ఇందులోనూ కొంతమంది ఆరితేరారు. వారి పోటీదారుల ప్రతిష్ట దెబ్బతీయడానికి  వీరే వినియోగాదారుడిగా అవతారం ఎత్తి అక్కడ కంప్లైంట్స్ పోస్ట్ చేస్తుంటారు. అదేవిధంగా తమ వెబ్సైట్ గురించి వినియోగదారుడు చెప్పినట్టుగా వీరే ప్రశంసలు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే  మరీ దారుణంగా వీళ్ళే కంప్లైంట్స్ .కాం అని వెబ్సైట్ వోపెన్ చేసి యూజర్స్ నుండి కంప్లైంట్స్ ఆహ్వానిస్తూ ఉంటారు. వీళ్ళే న్యాయ నిర్ణేతలుగా అవతారం ఎత్తి ఆ వెబ్సైట్లలో Top rated tips providers అని హెడింగ్ పెట్టి వీళ్ళ అనుకూల వెబ్సైట్ల పేర్లు రేటింగ్ ఇస్తూ ఉంటారు. అలాగే Worst tips providers అని హెడింగ్ పెట్టి  పోటీదారుల పేర్లు ఇస్తూ ఉంటారు. నిజంగా ఎంత నీచం? ఇంత నీచాతి నీచంగా డబ్బు సంపాదించడం కంటే..........(censored ).  
కొన్ని కంప్లైంట్ వెబ్సైట్స్ : 
పైవి కేవలం ఉదాహణకి మాత్రమె ఇవ్వడం జరిగింది. అందులో జెన్యూన్ సైట్స్ ఏవో నేను చెప్పబోవడం లేదు. అక్కడ అన్ని కంప్లైంట్స్ చదివి నిజంగా జెన్యూన్ గా  ఉన్న కంప్లైంట్ ఏదో మనం తార్కికంగా  ఒక నిర్ణయానికి రావచ్చు.

అసలు మార్కెట్ లో ఆన్లైన్ ట్రేడింగ్ ని బేస్ చేసుకుని చాల మోసాలు జరుగుతున్నాయి. వాటిలో కొన్ని:


  • కొంతమంది ప్రకటనలు ఇలా ఉంటాయి. "లక్ష రూపాయలు పెట్టుబడి  పెట్టండి (వారి చేతికి ఇవ్వాలి), నెలకు 10 వేలు చొప్పున 18 నెలలు ఇస్తాము" అంటారు. ఇలా సేకరించిన డబ్బుని ట్రేడింగ్ లో పెట్టి ఎక్కువ లాభాలు ఆర్జిద్దామనుకుంటారు. ఒకానొక దుర్ముహూర్తం లో మార్కెట్ కుప్పకూలి డబ్బంతా నష్టపోయి బోర్డు తిప్పేసి పలాయనం చిత్తగిస్తారు. 
  • మరికొంతమంది ఆర్ధిక సలహాదారులు గా అవతారం ఎత్తి  మీ డబ్బు తో మేము ట్రేడింగ్ చేస్తాము, రోజుకి ఇంత లాభం ఇస్తాము, పెట్టుబడి పెట్టండి అని డబ్బులు వసూలు చేసి మార్కెట్ హెచ్చు తగ్గులు తట్టుకోలేక నష్టాలు పాలై పెట్టుబడిని అర్పణం చేసేస్తారు. 
  • కొంతమంది మా వద్ద చాల తక్కువ బ్రోకరేజీ (కమీషన్) ఉంటుంది, చాల ఎక్కువ మార్జిన్ మనీ కి అవకాసం ఉంది  కేవలం 1000/- తో బంగారం లో ట్రేడింగ్ చేసుకోవచ్చు అని క్లయింట్లు ని ఆకర్షించి పెట్టుబడులు సేకరించి పత్తా లేకుండా పారిపోతాయి 


ఇలా చాల చాల దారుణంగా మోసాలు జరుగుతున్నాయి. మీ డబ్బుతో ట్రేడింగ్ చేస్తాము అని చెప్పేవాళ్ళు నిజంగా మార్కెట్ పట్ల అవగాహన కలిగి ఉండి, నిపుణులైతేనే వారిని ఎంచుకోండి. లేదా మీరే స్వంతం గా ట్రేడింగ్ చెయ్యదలచినప్పుడు మీకు మార్కెట్ గురించి పూర్తి అవగాహన వచ్చేదాకా మంచి టిప్స్ ప్రొవైడర్స్ మీద ఆధార పడండి.  అయినా టిప్స్ ప్రొవైడర్స్ ఎవరికైనా ఫీజు కట్టేటప్పుడు ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి. 
  1. వాళ్ళు తప్పనిసరిగా ఫ్రీ ట్రయల్ కి ఇచ్చి తీరాలి 
  2. క్రమం తప్పకుండా ప్రతి రోజూ క్రితం రోజు జరిగిన   లావాదేవీల తాలూకు రిపోర్టులు మరుసటి రోజు వారి వెబ్సైట్ లో "past performance" పేరుతో అనౌన్స్ చెయ్యాలి. 
  3. వారి దగ్గర నుండి ఫ్రీ ట్రయల్ తీసుకుని వారు ఆ 2 రోజుల పాటు ఇచ్చిన రిజల్ట్, వారి వెబ్సైట్ లో past performance పేరుతో ఇచ్చిన రిజల్ట్ ని పోల్చి చూడాలి. 
  4. మీకు కొంచెం నమ్మకం కలిగాక వారినే మళ్ళి ఇంకో 2 రోజులు ఫ్రీ ట్రయల్ కోసం రిక్వెస్ట్ చేసి వారి కాల్స్ performance చెక్ చెయ్యాలి. 
  5. ఆ తర్వాత ఒక వారం గాని, 15 రోజులు గాని Paid Trial కోసం రిక్వెస్ట్ చేసి కొద్ది మొత్తం ఫీజుతో ఇంకో 10 రోజులు వారి టిప్స్ ని చెక్ చెయ్యాలి. 
  6. ఇదంతా వెబ్సైట్ లో యధాతధంగా పబ్లిష్ చేస్తున్నారా గమనించాలి. 

అప్పుడు  మంత్లీ ఫీజు కట్టి జాయిన్ అవ్వొచ్చు. ఇలా చేస్తే కనీసం వారి టిప్స్ లో దమ్ము లేకపోయినా వారు నిజాయితీగా వ్యవహరిస్తున్నారు అని తెలుస్తుంది. దీనికి తోడు వారి టిప్స్  సక్సెస్ రేటు ఎక్కువ ఉంటె మీరు నిర్భయంగా జాయిన్ అయిపోండి.
ఇక్కడో చిన్న సవరణ: Past performance is not indicative of future  result అనే సూత్రాన్ని గుర్తు పెట్టుకుని వారు మార్కెట్ లో కింగులు, బొంగులు అని నిర్ణయానికి రాకుండా ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ ట్రేడింగ్ చెయ్యండి. 
అందుకే నేను చాల పారదర్శకంగా ఇక్కడ మార్నింగ్ లైవ్ కాల్స్ ఇచ్చి, ఈవెనింగ్ కల్లా రిజల్ట్ ఇస్తున్నాను. ఫలితాన్ని మీ కళ్ళకి రుజువులతో చూపిస్తున్నాను. కాని ఎవరూ, ఎల్లప్పుడూ ఇలా ఇవ్వలేరు, అందరూ ఇలాగే ఇస్తారని కాదు, ఇవ్వరు కూడా!!! (ఇలా ఇస్తూ పోతే నాకు ఫీజు కట్టకుండా ఎవరికి  వాళ్ళు నా కాల్స్ తో  ట్రేడింగ్ చేసుకుంటూ ఉంటారు). అందుకని మంత్లీ ఫీజు చెల్లించిన వాళ్లకి మెయిల్ కి, మొబైల్ కి ఆ రోజు ట్రేడ్ చెయ్యాల్సిన స్క్రిప్స్, లెవల్స్ పంపిస్తూ ఉంటారు. 
TYPES OF TRADING
Intra day trading: ఉదయం ఎంటర్ అయి రాత్రికి ఎగ్జిట్ అవ్వడం 
Positonal trading: ఈ రోజు ఎంటర్ అయి కొన్ని రోజులు, నెలలు తర్వాతా ఎగ్జిట్ అవ్వడం 
STBT: Sell today Buy tomorrow
BTST: Buy today Sell tomorrow
STOP LOSS
 ట్రేడింగ్ లో ఈ స్టాప్ లాస్ అత్యంత కీలకమైనది. అసలు స్టాప్ లాస్ తెలీకుండా ట్రేడింగ్ చెయ్యడం కళ్ళు మూసుకుని బాణం వెయ్యడమే. మనం బయ్ కాని, సెల్ కాని పొజిషన్ తీసుకున్నప్పుడు స్క్రిప్ కదలికలు ఖచ్చితంగా పైకే లేదా కిందికే వెళ్తాయని చెప్పలేము , పైకి కిందికి ఆసిలేషన్ జరుగుతూ తర్వాతా నిలకడగా వెళ్తుంది. ఈ  కదలికలు మన పొజిషన్ కి అనుకూలంగా ఉండొచ్చు, వ్యతిరేకంగా ఉండొచ్చు. అనుకూలంగా కదులుతూ అకస్మాత్తుగా వ్యతిరేకంగా వెళ్ళవచ్చు. ఈ సందర్భంలో చాల నష్టాన్ని పొందుతాము లేదా వ్యతిరేకంగా కదులుతూ అకస్మాత్తుగా అనుకూలంగా మారవచ్చు ఈ సందర్భంలో మనం వచ్చే లాభాన్ని కోల్పోవచ్చు. ఎందుకంటే వ్యతిరేక కదలికలు ఉన్నాయి అని మనం మన పొజిషన్ నుండి ఎగ్జిట్ అవుతాము మనం ఎగ్జిట్ అవ్వగానే అది అనుకూలంగా కదులుతూ రావచ్చు. దానివల్ల రావాల్సిన లాభం మనం ఎగ్జిట్ అవ్వడం వల్ల  కోల్పోతాము. అందుకని మనం ఎప్పుడు మార్కెట్ లో ఎంట్రీ అయినా (బయ్ కాని, సెల్ కాని) వెంటనే స్టాప్ లాస్ పొజిషన్  కూడా ఇవ్వాలి. దీనివల్ల ఈ స్క్రిప్ నేను అనుకున్న రేటు కంటే వ్యతిరేక దిశలో కదులుతూ ఉండి ఇంతకంటే కిందికి దిగితే / పైకి పెరిగితే స్వల్ప నష్టం తో నా పొజిషన్ క్లోజ్ చెయ్యి అని మన కంప్యూటర్ కి చెప్పడం అన్నమాట. దీనినే స్టాప్ లాస్ అంటారు. దీని గురించి వివరంగా తర్వాత చర్చిద్దాము 
TARGET
టార్గెట్ అంటే మనం పలానా స్క్రిప్ లో ఎంట్రీ అవగానే ఆ స్క్రిప్ కదలికలు మనకు అనుకూలంగా వచ్చినప్పుడు పలానా రేటు దగ్గర లాభం తో నా పొజిషన్ క్లోజ్ చెయ్యి అని కంప్యూటర్ కి చెప్పడం. మీకు టిప్స్ ఇచ్చే టెక్నికల్ అనలిస్తులని బట్టి ఈ టార్గెట్స్ 2 గాని 3 గాని ఉంటాయి. మీరు సేఫ్ ట్రేడింగ్ కోసం మొదటి టార్గెట్ దగ్గరే వచ్చిన లాభంతో సరిపెట్టుకుని ఎగ్జిట్ అవ్వడం శ్రేయస్కరం. 
SUCCESSFUL TRADING SECRETS
  • మంచి టిప్స్ ప్రొవైడర్స్ ని కాని, మంచి ఇండికేటర్స్ ను గాని, మంచి టెక్నికల్ అనలిస్ట్ ని కాని ఎంచుకోండి. తెలిసీ తెలియని స్వంత నాలెడ్జి తో గుడ్డిగా ట్రేడింగ్ చెయ్యవద్దు.
  • మీరు ట్రేడింగ్ కు కొత్త అయితే  టిప్స్ ప్రొవైడర్స్ వారి అన్ని టార్గెట్స్ వచ్చిందాకా వెయిట్ చెయ్యకండి. అలాగే టార్గెట్స్  టిప్స్ ప్రొవైడర్స్ ఇచ్చిన రేటుకంటే చాల ముందుగానే ఎగ్జిట్ అవండి 
  • ప్రతీ ట్రేడు లాభం పొందాలని అనుకోకండి. అది అసాధ్యం. ఇక్కడ అర్హత నష్టపోవడం కూడా అని తెలుసుకోండి. మీరు 100 ట్రేడ్స్ చేస్తే అందులో 65 లాభం తోనూ 45 నష్టం తోనూ ముగియడం ఆరోగ్యకరమైన ట్రేడింగ్.
  • స్టాప్ లాస్, టార్గెట్ తప్పకుండా పెట్టుకోండి. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల తర్వాత యూ.ఎస్. మార్కెట్స్ వోపెన్ అవుతాయి. ఆ టైం లో స్క్రిప్స్ చాల వేగంగా కదులుతూ ఉంటాయి. స్టాప్ లాస్ పెట్టుకోకపోతే ఈ కదలికలు వేగంగా జరిగి మన అకౌంట్ లో మనీ మొత్తం కరిగిపోతాయి. 
  • లాభం నమోదు చేసుకోగానే ఎగ్జిట్ అవ్వండి మరింత లాభం కోసం ఎదురు చూడకండి, ఉన్నది కూడా పోవచ్చు. 
  • తక్కువ అమౌంట్ పెట్టి పొజిషన్ ట్రేడింగ్ తీసుకోవద్దు.  తక్కువ  అమౌంట్ ఉన్నప్పుడు కేవలం ఇంట్రాడే ట్రేడింగ్ మాత్రమె చెయ్యండి. అది నష్టమైనా సరే ఎగ్జిట్ అయి మర్నాడు ఫ్రెష్ గా పొజిషన్ తీసుకోండి. 
  • ట్రేడింగ్ లో వచ్చిన లాభం విత్ డ్రా చేసుకోండి. అంతేగాని వస్తూ ఉన్న లాభాన్ని అలాగే ఉంచి ట్రేడింగ్ వాల్యూమ్స్ పెంచుకుంటూ పోకండి. లాభం విత్ డ్రా చేసుకుని దాన్ని ఉపయోగించుకుంటేనే  మనం లాభం పొందినట్టు. మన అకౌంట్ లో కన్పిస్తూ ఉన్నంత మాత్రాన మన స్వంతం కాదు. ఈ సూత్రం అర్ధం చేసుకోండి. 
  • ఆశ, భయం, ఊగిసలాడే మనసు వీటిని అధిగమించండి. ముందే చెప్పినట్టు డబ్బు పోతే బాధపడకండి. పెళ్లి కోసం, చదువు కోసం లాంటి అవసరాల కోసం దాచిన సొమ్ము తో ఎట్టి  పరిస్థితుల్లో ట్రేడింగ్ చెయ్యకండి. ఎక్కువగా అలాంటి ట్రేడింగ్ లు లాభాలతో కాకుండా నష్టాలతో ముగుస్తాయి. ఈ ట్రేడింగ్ లో ఇంతే అమౌంట్ పెట్టి చేస్తాను ఇది నష్టపోతే మళ్లీ ట్రేడింగ్ చెయ్యను అని వొట్టు పెట్టుకోండి. ట్రేడింగ్ అందరికీ అచ్చి రాదు. 
  • ఈ రోజు ట్రేడ్ లో స్టాప్ లాస్ హిట్ అయితే మళ్లీ లాస్ కవర్ కోసం పొజిషన్ తీసుకోకండి. ముందే చెప్పినట్టు లాస్ తో క్లోజ్ అవడం కూడా ఒక అర్హతే అన్నది గుర్తెరగండి.
  • అదే పనిగా ఒక్క రోజు లో ఎక్కువ ట్రేడింగ్ లు చెయ్యకండి. 
  • కనీసం కొంచెం ట్రేడింగ్ పరిజ్ఞానమైనా పెంపొందించుకోండి. Support, Resistance, Pivot point, Time frame, Charts, indicators, patterns, bullish, bearish, lot size, Hedging లాంటి ప్రాధమిక విషయాలు తెలుసుకోండి. 
చెప్పుకోవాలంటే ఇలాంటివి 100 ఉన్నాయి, ప్రస్తుతానికి ఇవి చాలు.

TRADING TRAINING INSTITUTES 
ఇంకా చెప్పాలంటే ఈ ట్రేడింగ్ గురించి పెద్ద గ్రంధమే తయారౌతుంది. ట్రేడింగ్ తెలిసినవాళ్ళకు అది అవసరం లేదు. తెలియని వాళ్లకు ఇక్కడ ఎంత చెప్పినా మొత్తం అర్ధం కాదు. వారు లైవ్ లో ట్రేడింగ్ చేస్తూ నేర్చుకుంటేనే అవగాహన కలుగుతుంది.  ప్రత్యక్షంగా క్లాసులకి వెళ్ళడం తప్పదు. అది అన్ని విధాలా ప్రయోజనకారి. ఈ క్రింది అడ్రస్ లో నాకు తెలిసిన కొంతమంది ట్రేడింగ్ గైడ్స్ ఉన్నారు వీలైతే కలవండి. 
....................................................................................................
తెలుగు లో ట్రేడింగ్  మెటీరియల్ ఇస్తూ ట్రేడింగ్ గురించి ఒక రోజు క్లాస్ తీసుకుంటారు. రవీందర్ గారు (హైదరాబాద్)  ఫీజు : 2500   
.......................................................................................................
షేర్ గురించి 3 రోజులు,  కమోడిటీ గురించి 1 రోజు ట్రైనింగ్ తీసుకుంటారు. పేరు సత్యనారాయణ గారు. 
ఫీజు షేర్స్ ట్రైనింగ్: 2500 (3 రోజులు)
ఫీజు కమోడిటీ : 1000 ( 1రోజు) 
(వీరి క్లాస్ ప్రాధమిక పరిజ్ఞానం కలిగి ఉండి, లైవ్ ట్రేడింగ్ చేసేవాళ్ళకు బాగా ఉపయోగం. అసలు ట్రేడింగ్ తెలియని వాళ్ళు విషయ పరిజ్ఞానం కోసమైతే వెళ్ళండి )
..........................................................................................................
డిసెంబర్ 15,16 మరియు 17 వ తేదీల్లో HM TV వాళ్ళు technical analysis మీద 3 రోజులు వర్క్ షాప్ వైజాగ్ లో నిర్వహిస్తున్నారు. ట్రేడింగ్ గురించి, ప్రాక్టికల్ గా విజయం సాధించడం ఎలా అనే అంశాలతో ట్రైనింగ్ ఇస్తున్నారని తెలిసింది.  పేరు : బ్రహ్మచారి గారు. ఇందులో సిలబస్ గురించి, మరింత సమాచారం గురించి ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించండి. businesseditor@hmtv.in ఫీజు 5500/-
(వీరి క్లాస్ కూడా ప్రాధమిక పరిజ్ఞానం కలిగి ఉండి, లైవ్ ట్రేడింగ్ చేసేవాళ్ళకు బాగా ఉపయోగం. అసలు ట్రేడింగ్ తెలియని వాళ్ళు విషయ పరిజ్ఞానం కోసమైతే వెళ్ళండి )
..........................................................................................................
స్టాక్ మార్కెట్ ప్రాధమిక పరిజ్ఞానం గురించి, టెక్నికల్ క్లాస్ గురించి క్షుణ్ణంగా 23 రోజుల ట్రైనింగ్ కోసం ఇక్కడ సంప్రదించండి.  మెటీరియల్ ఉంటుంది. పేరు చక్రవర్తి గారు. ఫీజు: 15000/-
(అసలు ట్రేడింగ్ గురించి తెలియని వాళ్లకు ఈయన క్లాస్ బాగా ఉపయోగం. అయితే ఈయన స్టాక్ మార్కెట్ గురించి ట్రైనింగ్ ఇవ్వడం లో నిష్ణాతులు. కమోడిటీ ట్రేడింగ్ గురించి ఈయన క్లాసు తీసుకోరు. ఇక్కడ లైవ్ ట్రేడింగ్ ఉండదు)
 ..............................................................................................................
కొత్తగా ఇందులోకి రాబోయేవారు ముందు ప్రాధమిక పరిజ్ఞానం నేర్చుకుని, ఆ తర్వాత  లైవ్ ట్రేడింగ్ నేర్చుకుని,  కొద్దో గొప్పో ట్రేడింగ్ చేసి, లాభమో నష్టమో నమోదు చేసుకుని మరింత నాలెడ్జి ఇచ్చే వ్యక్తుల కోసం, సంస్థల కోసం నిరంతరం అన్వేషించాలి. 
పైన నేను ఇచ్చిన అన్ని అడ్రస్ లు పెద్దగా నాలెడ్జి లేకుండా  లైవ్ ట్రేడింగ్ చేసేవాళ్ళకు ఉపయోగం. కాని అస్సలు ట్రేడింగ్ తెలీని వాళ్లకు వోనమాలు నుండి లైవ్ ట్రేడింగ్ చేస్తూ ట్రైనింగ్ ఇచ్చే సంస్థల గురించి నాకు తెలీదు. ఒక చోట థియరీ ఉంటె ఒక చోట ప్రాక్టికల్ (లైవ్ ట్రేడింగ్) ఉండదు. రెండూ కలిసి ఒకచోట లేవు. మీకు తెలిస్తే చెప్పండి. చాల మందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. 
పై అడ్రస్ లలో మీరు ఫోన్ చేసి సంప్రదించి నిర్ణయం తీసుకోండి.

దీనితో పాటు ఈ  టాపిక్ మీద నేను గతంలో  సందర్భానుసారం పబ్లిష్ చేసిన కొన్ని   పోస్ట్  ల లింక్స్  ఇక్కడ  చూడండి

http://enter2dayearn2marrow.blogspot.in/2012/10/blog-post.html

http://enter2dayearn2marrow.blogspot.in/2012/11/today-calls.html

http://enter2dayearn2marrow.blogspot.in/2012/11/4-75.html

ప్రస్తుతానికి నా పోస్ట్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ముందే చెప్పినట్టు రాసే కొద్దీ  పెద్ద గ్రంధమే తయారౌతుంది. మీకు వడ్డించిన విస్తరి లా ఇంత సమాచారాన్ని ఇక్కడ ఇస్తున్నాను. నాకు ఇలా ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరు, అన్వేషించి తెలుసుకున్నాను. పై అందరినీ సంప్రదించాను. ట్రైనింగ్ తీసుకున్నాను. స్వంత నాలెడ్జి ని ఇంటర్నెట్ సాయంతో మరికొంత సంపాదించాను. ఇంకా అన్వేషిస్తూ ఉన్నాను. ఈ అన్వేషణ ఎప్పటికీ ఆగేది కాదు. ఈ క్రమంలో నాతో పాటు మరికొంతమందిని సంపాదనా పరులుగా మార్చడమే నా ధ్యేయం 
వీలైతే మరి కొన్ని అంశాలు సందర్భాన్ని బట్టి పోస్ట్ చేస్తాను. మీ అభిప్రాయాలు, సందేహాలు ఇక్కడ కామెంట్ రూపంలో పెట్టడం నాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ధన్యవాదాలు