స్టాక్
మార్కెట్ లో నేరుగా పెట్టుబడి పెట్టేందుకు సాహసం చేయ లేని ఇన్వెస్టర్లకు
మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్ అనువైనవి.మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్సమీకరించిన నిధులను వ్యూహాత్మకంగా ఈక్విటీ లలోను ఇతర పెట్టుబడి సాధనాల్లోను మదుపు చేస్తారు.
మార్కెట్ ట్రెండ్స్ గురించి తెల్సిన విశ్లేషకుల సహాయం తో మదుపు చేస్తారు కాబట్టి నష్టాలకు అవకాశం తక్కువగా వుంటుంది .మార్కెట్ విశ్లేషకులు ఇచ్చే సూచనల మేరకు అవసరమైన సందర్భాలలో పెట్టుబడులను మారుస్తుంటారు.పెట్టు బడి పెట్టిన మొత్తాలకు నష్టం వాటిల్ల కుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు.
స్టాక్ మార్కెట్ గురించి ఏమీ తెలియని ఇన్వెస్టర్లు కూడా ధైర్యం గా ఈ ఫండ్స్ లో మదుపు చేయ వచ్చు. అందుకే ఫండ్స్ కి ఆదరణ పెరుగుతోంది.వందల కొద్ది స్కీమ్స్ వస్తున్నాయి. వీటిలో మంచి వాటిని చూసి ఎంచు కుంటే
లాభాలు గడించే అవకాశాలు వుంటాయి. ఈ ఫండ్స్ లో "సిప్ "విధానం లో కూడా మదుపు చేయవచ్చు.
మార్కెట్ ట్రెండ్స్ గురించి తెల్సిన విశ్లేషకుల సహాయం తో మదుపు చేస్తారు కాబట్టి నష్టాలకు అవకాశం తక్కువగా వుంటుంది .మార్కెట్ విశ్లేషకులు ఇచ్చే సూచనల మేరకు అవసరమైన సందర్భాలలో పెట్టుబడులను మారుస్తుంటారు.పెట్టు బడి పెట్టిన మొత్తాలకు నష్టం వాటిల్ల కుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు.
స్టాక్ మార్కెట్ గురించి ఏమీ తెలియని ఇన్వెస్టర్లు కూడా ధైర్యం గా ఈ ఫండ్స్ లో మదుపు చేయ వచ్చు. అందుకే ఫండ్స్ కి ఆదరణ పెరుగుతోంది.వందల కొద్ది స్కీమ్స్ వస్తున్నాయి. వీటిలో మంచి వాటిని చూసి ఎంచు కుంటే
లాభాలు గడించే అవకాశాలు వుంటాయి. ఈ ఫండ్స్ లో "సిప్ "విధానం లో కూడా మదుపు చేయవచ్చు.
బిర్లా సన్ లైఫ్ డివిడెండ్ ఈల్డ్ ప్లస్
ఇది ఓపెన్ ఎండెడ్ ఫండ్, ఈ ఫండ్ ఆస్తుల విలువ 883 కోట్లు . క్రిసిల్ ఈ ఫండ్ స్కీం కి రెండో రాంక్ ఇచ్చింది. ఈ ఫండ్ టాప్ హోల్డింగ్స్ లో ఇంజినీరింగ్,బ్యాంకింగ్ , ఆటోమోటివ్, బెవరేజేస్ ,టెక్నాలజీ ,ఆయిల్ అండ్ గ్యాస్ ఇతర రంగాలకు చెందిన ఇన్ఫోసిస్ ,టీ సి ఎస్ ,ఏ సి సి ,చంబల్ ఫెర్టి లైజర్స్,బీ పీ సి ఎల్ తదితర కంపెనీల షేర్లు వున్నాయి .సేకరించిన నిధుల్లో 90శాతం ఈక్విటీ లలో మదుపు చేసింది.ప్రస్తుతం ఫండ్ యూనిట్ ఏ ఏ వీ విలువ 80 కాగా 52వారాల గరిష్ట ఎన్ ఏవీ రూ 94 .అలాగే 52వారాల కనిష్ట ఎన్ ఏ వీ రూ .77 మాత్రమే .దీర్ఘ కాలిక వ్యూహం తో ఈ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. ఆకర్షనీయమైన డివిడెండ్ కూడా పొందవచ్చు.
ఎస్ బీ ఐ మాగ్నం ఎమర్జింగ్ బిజినెస్ ఫండ్
ఈ ఓపెన్ ఎండ్ ఫండ్ పని తీరు ప్రోత్సాహకరం గా వుంది.ఫండ్ ఆస్తుల విలువ 354 కోట్లు. ఫండ్ టాప్ హోల్డింగ్స్ లో ప్రముఖ కంపెనీ లున్నాయి .ఇంజినీరింగ్,బ్యాంకింగ్ , ఆటోమోటివ్,ఇతర రంగాలకు చెందిన బజాజ్ హోల్డింగ్స్ ,గుడ్ ఇయర్,జిందాల్ స్టీల్, రిలయన్సు , టెక్స్మాకో, ఆగ్రో టేక్ ఫుడ్స్ ,మనపురం ఫైనాన్సు ,పేజ్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీ షేర్లలో ఫండ్ మదుపు చేసింది .ఫండ్ సమీకరించిన నిధుల్లో 90 శాతం ఈక్విటీ మార్కెట్ లోనే ఇన్వెస్ట్ చేసింది .ఇతర పెట్టుబడి సాధనాల్లో మిగతా పది శాతం మదుపు చేసింది. ఫండ్ మేనేజర్స్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ హోల్డింగ్స్ ను అవసరమైన సందర్భాల్లో మారుస్తూ ఫండ్ ను లాభాల బాటలో నడిపిస్తున్నారు. ప్రస్తుతం ఫండ్ ఎన్ ఏ వీ రూ.44 కాగా 52 వారాల గరిష్ట ఎన్ ఏ వీ 46 కాగా కనిష్ట ఎన్ ఏ వీ 35మాత్రమే. ప్రస్తుత ధర వద్ద ఈ ఫండ్ యూనిట్ల ను కొనుగోలు చేయవచ్చు.
కోటక్ లైఫ్ స్టైల్ ఫండ్
ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్ 2006 లో మొదలైంది.ఫండ్ ఆస్తుల విలువ 84 కోట్లు .ఫార్మా ,బ్యాంకింగ్,ఫైనాన్సు ,మీడియా , టొబాకో,ఫుడ్, బెవరేజస్ రంగాలకు చెందిన ఐ టీ సి ,
హెచ్ డీ ఎఫ్ సి బ్యాంకు ,ఐ సి ఐ సి ఐ బ్యాంకు,సన్ ఫార్మా ,ఆసియన్ పెయింట్స్ ,లూపిన్, ఇమామి ,గ్లాక్సో కంపెనీలకు చెందిన షేర్లలో ఫండ్ మదుపు చేసింది. ఈక్విటీ కే ఫండ్ ప్రాధాన్యమిచ్చింది. క్రిసిల్ ఈ ఫండ్ కి రెండో ర్యాంక్ ఇచ్చిం ది .ఫండ్ పని తీరు బాగానే వుంది . 52వారాల గరిష్ట ఎన్ ఏ వీ 15కనిష్ట ఎన్ ఏ వీ 13 మాత్రమే. దీర్ఘ కాలిక వ్యూహం తో లో ఈ యూనిట్లను కొను గోలు చేయవచ్చు
.
హెచ్ డీ ఎఫ్ సి మిడ్ క్యాప్ అపర్చ్యునిటీస్ ఫండ్
హెచ్ డీ ఎఫ్ సి మిడ్ క్యాప్ అపర్చ్యునిటీస్ ఫండ్
మార్చ్ 2007 లో ప్రారంభ మైన ఈ ఫండ్ ఆస్తుల విలువ 1296 కోట్లు .ఈ ఫండ్ టాప్ హోల్డింగ్ లో ఫార్మా,ఇంజనీరింగ్ .కెమికల్స్ బ్యాంకింగ్ , ఆటోమోటివ్ రంగాలకు చెందినఇప్క లాబ్స్ ,లూపిన్ ,బాటా ఇండియా,బ్యాంకు ఆఫ్ బరోడా ,యునియన్ బ్యాంకు ,ఇండియన్ బ్యాంకు . వేసువియాస్ ఇండియా,ఎక్సైడ్ ఇండస్ట్రీస్ షేర్లు వున్నాయి .
ఫండ్ సమీకరించిన నిధుల్లో 80 శాతం ఈక్విటీ లలో మదుపు చేయగా మిగిలిన 20 శాతం ఇతర సాధనాలలో ఇన్వెస్ట్ చేసింది.క్రిసిల్ ఈ ఫండ్ కి ఫస్ట్ రాంక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫండ్ యూనిట్ల ఎన్ ఏ వీ . రూ. 15 కాగా 52 వారాల గరిష్ట ఎన్ ఏవీ రూ. 17 కాగా కనిష్ట ఎన్ ఏవీ 13 మాత్రమే. దీర్ఘ కాలం లో ఈ ఫండ్ మంచి రాబడులు అందించే అవకాశాలున్నాయి. ప్రస్తుత ధర వద్ద ఈ ఫండ్ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు .