పోర్ట్ ఫోలియో ఏర్పాటుకు ఇదే అదను
ఇన్వెస్టర్లు కొత్త పోర్ట్ ఫోలియో ఏర్పాటు చేసుకోవడానికి ఇది మంచి సమయం.
మార్కెట్ 15000పాయింట్ల వద్దనే ఊగిస లాడుతోంది.దీర్ఘ కాలిక లక్ష్యం తో
మంచి షేర్లను ఎంచుకొని మదుపు చేస్తే భవిష్యత్ లో లాభాలు అందుకునే అవకాశాలు
పుష్కలం గా వున్నాయి. ఇప్పటికే పలు మంచి కంపెనీల షేర్లు చౌక ధరల వద్ద ట్రేడ్
అవుతున్నాయి . ప్రస్తుత దశలో మార్కెట్ ఒడిదుడుకులకు తట్టుకుంటూ
స్వల్పం గా నష్ట పోతూ ,మంచి పని తీరుతో దూసుకు పోతున్న కంపెనీల షేర్లను
ఎంచుకుని పరిశీలించండి. ఇందు కోసం కొంత అధ్యయనం చేస్తే మరీ మంచిది.
స్టాక్ మార్కెట్ లో పెట్టు బడి పెట్టాలని ఉబలాట పడే కొత్త ఇన్వెస్టర్లు కూడా
పోర్ట్ ఫోలియో గురించి తెలుసుకుంటే మేలు.
పోర్ట్ ఫోలియో అంటే పలు రకాలైన షేర్లను కలిగి ఉండటమే.పెట్టుబడి మొత్తాన్ని
వివిధ రంగాలకు చెందిన షేర్ లకు పంచి ఆయ షేర్ల ద్వారా వచ్చే లాభ నష్టాలను
బ్యాలన్సు చేసుకోవడాన్నే పోర్ట్ ఫోలియో నిర్వహణ అంటారు .కాగా షేర్లలో రిస్క్
తగ్గించుకోవడానికి ఏకైక మార్గం పోర్ట్ ఫోలియో ను సక్రమం గా నిర్వహించుకోవడమే .
పోర్ట్ ఫోలియో లో 5నించి 10షేర్లు వుండాలి .10 కన్నా ఎక్కువ షేర్లు మంచిది కాదని
నిపుణుల అభిప్రాయం . ఇన్వెస్టర్ల స్తోమత ను బట్టి రెండు, మూడు పోర్ట్ ఫోలియో లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.
అయితే అందుకు తగిన నిర్వహణ సామర్ద్యం వుండాలి.
స్టాక్ మార్కెట్ ద్వారా స్తిరమైన లాభాలు ఆర్జించ గోరే వారు పోర్ట్ ఫోలియో ను
నిర్వహించడమే మేలు .అవసర మైన సందర్భాలలో ఈ పోర్ట్ ఫోలియో ను మారుస్తుండాలి .
మార్చాలనుకుంటే మూడు నెలల కాలాన్ని లక్ష్యం గా పెట్టుకుని క్రమం గా మార్చాలి .
లేక పోతే రిస్క్ పెరిగి పోతుంది. అలా అని పోర్ట్ ఫోలియో ను పదే పదే మార్చడం కూడా మంచిది కాదు.
అయితే షేర్ల ధరలను మాత్రం తరచుగా సమీక్షిస్తుండాలి .అప్పుడే మనకు లాభాలు వస్తున్నాయా?
నష్టాలు వస్తున్నాయా అనేది అపుడే తెలుస్తుంది .
మార్కెట్ డౌన్ ట్రెండ్ లో వున్నపుడు మంచి షేర్లు కనిష్ట ధరల వద్ద లభిస్తుంటాయి.
కాబట్టి ఆలాంటి సమయం లో పోర్ట్ ఫోలియో లో మంచి షేర్లను పెట్టుకోవాలి .
పోర్ట్ ఫోలియో లో ఎపుడు ఒకే పరిశ్రమ కు సంబంధిన షేర్లను ఉంచు కోవడం ప్రమాదం.
ఆ పరిశ్రమ సెంటిమెంట్ బలహీన పడినపుడు షేర్ల ధరలు తగ్గుముఖం పడతాయి .
అపుడు నష్ట పోయే అవకాసం వుంది . కాబట్టి వేర్వేరు పరిశ్రమ లకు చెందిన షేర్లను ఎంపిక చేసుకోవడం మంచిది.
ప్రస్తుతం మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పటికీ జనవరి తర్వాత విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ళు మళ్ళీ ఊపందుకోవచ్చు.
కొన్ని ప్రతి కూల అంశాలు ఉన్నప్పటికీ ప్రపంచ మార్కెట్లలో భారత్ మార్కెట్లే ఆకర్షనీయం వున్నాయి. ఈ నేపధ్యం లో మార్కెట్లు సమీప భవిష్యత్ లో పుంజుకునే సూచనలు లేక పోలేదు .కాబట్టి ఇన్వెస్ట్ మెంట్ కి ఇదే సరైన తరుణం.