స్టాక్ మార్కెట్ విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు

స్టాక్ మార్కెట్ విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ,కొనుగోళ్లకు ప్రతిస్పందిస్తూ ఒడిదుడుకులకు లోనవుతుంటుంది.
విదేశీ ఇన్వెస్టర్లు షేర్లు కొనుగోలు చేసినపుడు సెన్సెక్స్ పెరగడం ,అమ్మకాలు జరిపినపుడు సెన్సెక్స్ పతనమవడం సర్వ సాధారణమే.
స్టాక్ మార్కెట్ లో ఈ ఊగిసలాట ధోరణి తరచుగా కన్పిస్తుంటుంది. మార్కెట్ పూర్తీ పతన దశలో వుండగా ఆదుకునేది విదేశీ  ఇన్వెస్టర్ లే.
అలాగే మార్కెట్ ని పతన దశలోకి నడిపిండేది వాళ్ళే. ఆరు ఏడేళ్ళుగా విదేశీ ఇన్వెస్టర్లు ఒక వ్యూహం ప్రకారం మార్కెట్ ని పెంచు కుంటూ వెళ్లారు .
వేల కోట్ల నిధులతో అత్యంత చౌ క ధరల్లో షేర్లను కొను గోలు చేసి  వాటి ధరలు తారా స్తాయికి చేరుకోగానే మరల నెమ్మదిగా అమ్మకాలు జరిపి అధ్బుతమైన  లాభాలు గడించారు.ఈ మొత్తం ప్రక్రియలో దేశీయ ఇన్వెస్టర్లు గడించింది తక్కువే.
దేశీయ ఇన్వెస్టర్లకు ఆర్ధిక సంస్తలకు నిర్దిష్టమైన వ్యూహం లేక పోవడం తో  లాభాల ఆర్జనలో విదేశీ ఇన్వెస్టర్ల తో పోలిస్తే వెనుక బడ్డారని చెప్పుకోవచ్చు

కాగా ఇప్పుడున్న పరిస్తితుల్లో మార్కెట్ మరింత దిగువకు వెళ్ళే అవకాశాలు తక్కువగానే వున్నాయి. మార్కెట్ అటు పడటం ఇటు వెంటనే మద్దతు దొరకటం జరుగుతోంది అయితే నవంబర్ ,డిసెంబర్ మాసాల్లో సహజం గా విదేశీ ఇన్వెస్టర్ల  కొనుగోళ్ళు  తక్కువగా వుంటాయి.కొత్త సంవత్సరం నేపధ్యం లో నిధుల   ఉపసంహరణ కూడా ఎక్కువగా వుంటుంది. ఈ క్రమం లో  మార్కెట్లో అమ్మకాల వొత్తిడి ఎక్కువగా వుంటుంది ఇలాంటి సమయం లో మార్కెట్ కొంత తగ్గుముఖం పట్టడం అనివార్యం. విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనక పోతే ఉత్తేజం లోపిస్తుంది. దీంతో షేర్ల ధరలు  కూడా తగ్గుతాయి. ఇలాంటి సందర్భాన్నే ఇన్వెస్టర్లు తెలివిగా వాడుకోవాలి. 
మంచి షేర్లు తక్కువ ధరల్లో దొరికితే కొనుగోలు చేయాలి .సెన్సెక్స్ కనిష్ట స్తాయిలో వున్నపుడు కొనుగోళ్ళు చేస్తే మార్కెట్ పెరిగినపుడు లాభాలు ఆర్జించే అవకాశాలు వుంటాయి. .
 అయితే ఇన్వెస్టర్లకు ఒక సందేహం కలగవచ్చు.కనిష్ట స్తాయి నుంచి మార్కెట్ మళ్లీ పెరుగుతుందా అన్న అనుమానం కలగ వచ్చు . కానీ ఇన్వెస్టర్లుఅలాంటిసందేహాలు  పెట్టు కోవలసిన అవసేరం లేదు.విదేశీ ఇన్వెస్టర్లు జనవరి మాసం లో మళ్ళీ పెట్టుబడులు పెట్టడం ఖాయం .భారత్ మార్కెట్ల లో లభించే అంత చౌకగా మరే దేశం లో షేర్లు చౌక ధరల్లో లభించవు.అలాగే భారత్ లాగా  పెట్టుబడులకు అనుకూలమైన దేశం మరొకటి లేదు .భారత్ దేశం బహుముఖం గా వృద్ధి సాధిస్తోంది. దేశీయం గ కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి లేదు. ఈ కారణం గా  విదేశీ పెట్టు బడులు 
తరలిరావడం ఖాయం  అని విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి ఏ కారణాల వల్ల అయినా  తాత్కాలికం గా మార్కెట్   డౌన్  ట్రెండ్ లో పడినా ఇన్వెస్టర్లు కంగారు పడాల్సిన అవసరం లేదు. మార్కెట్ తగ్గే కొద్ది  మంచి షేర్లను ఎంచు కొని  ఇన్వెస్ట్ చేయడం  మంచిది.