ఆర్ధిక
అక్షరాస్యత సాదించే సమయంలో ఎదుర్కొనే చాలా
బేసిక్ ప్రశ్న ఇది. చాలా మంది షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు.
కాని వారికి కూడా చాలా మందికి అతి బేసిక్ ప్రశ్న ఈక్విటీ అంటే ఏమిటి ? డేట్ లేదా ఋణ
పత్రం అంటే ఏమిటో తెలియదు.ఈ ఆర్టికల్ ద్వారా మీరు ఈక్వీటీ మరియు డేట్ అంటే ఏమిటి?
వాటి మధ్య గల తేడా ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం.
ఈక్వీటీ అనగా
షేర్లు లేదా వాటా అని అర్ధం అంటే మీరు ఒక కంపెనీలో ఈక్వీటీ తీసుకుంటున్నారు అంటే
మీ ఈక్వీటీ విలువకి అనుగుణంగా మీరు ఆ కంపెనీలో యాజమాన్యుపు హక్కును పొందుతారు.
మీరు ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు అనుకోండి. దానిని వంద సమానభాగాలు లేదా
ముక్కలుగా చేసి మీ వద్ద 51% భాగాలు లేదా
ముక్కలు ఉంచుకొని మిగితా భాగాలు లేదా ముక్కలు ఇతరులకు ఇచ్చేసారు అనుకోండి. ఈ
ముక్కలు లేదా భాగాలనే ఈక్వీటీ , షేర్లు లేదా వాటాలు అంటారు.ఈ విధంగా వాటాలు తీసుకున్న వారందరూ మీ కంపెనీలో మీతో పాటు వారి వాటా విలువకి అనుగుణంగా యాజమాన్యుపు హక్కును పొందుతారు.మీరు ఈక్వీటీ లేదా షేర్ గురుంచి మరింత వివరంగా తెలుసుకోవాడానికి షేర్ లేదా స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి ? అని నేను ఇది వరకు వ్రాసిన ఆర్టికల్ క్రింది లింక్ ద్వారా చదవండి.పూర్తీగా అర్ధం అవుతుంది.