షేర్ మార్కెట్ లో షేర్ ధరలు ఎందుకు పెరుగుతాయి.?
చాలా మందికి
షేర్లు లేదా షేర్ మార్కెట్ అంటే చాలా దురభిప్రాయం ఉంది.గుర్రపు పందాలు.పెకాటలాగే
అదికూడా ఒక వ్యసనం అనుకుంటూ ఉంటారు.నిజానికి అది
సరికాదు. రేసులూ, పెకాటాలు గెలవటం, ఓడటం అనేది కేవలం అదృష్టం మీదా మాత్రమే
అధారపడి ఉంటుంది.కానీ ఈ షేర్ల బిజినెస్ లో కాసింత జ్ఞానం తో పాటు
మెలకువతో ముందే రిస్కులను వూహించగలిగితే
లాభాన్ని సంపాదించవచ్చు.షేర్లలో ఉండే లాభాలు సాదరన్మగా రెండు రకాలుగా
ఉంటాయి.మనం కొన్న షేరు ధర పెరగడం వలన వచ్చే లాభం మొదటిది.రెండవది కంపెనీ వచ్చిన
లాభాలాలో నుండి మనకి కొత్త శాతం పంచి ఇవ్వడం . దానినే డివిడెండ్ అంటారు.ఒక షేరు ని మనం పది రూపాయలకు
కొని ఆర్నెల్ల తర్వాత దాని ధర ఇరవై రూపాయలకు పెరిగినప్పుడు అమ్మితే మనకి వచ్చిన
లాభం పది రూపాయలు.రియల్ ఎస్టేట్ కంటే కూడా అధిక లాభాలు అందించే సాధనం షేర్
మార్కెట్ . కాని దానిపై పూర్తీ అవగాహన మాత్రం తప్పనిసరి.బ్యాంకుల్లో డబ్బూ ని
ఫిక్సుడ్ డిపాజిట్ చేయడం వలన వచ్చే వడ్డీ శాతం కేవలం ఆరు నుండి ఎనిమిది శాతం
మాత్రమే.దానిని మెట్యురిటీ అయ్యే వరకు తీయలెం కూడా.తీసుకున్నా వడ్డీ నష్టం తప్పదు.అదే
షేర్ మార్కెట్ లో ఐతే మీ షేర్లు మీ ఇష్టం వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు.ఈ విధంగా
భూమూలు, స్తిరాస్తులూ కాపాడుకోవటం, అమ్ముకోవటం, లాభం తీసుకోవడం కన్నా ఈ వ్యాపారం
చాలా సులభం.
షేర్ ధర ఎందుకు
పెరుగుతుంది. ?
దీనికి చాలా
చిన్న సమాధానం. మనదేశంలో బ్యాంక్ వడ్డీ రేటు కన్నా మిగితా వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి.ఉదాహరణకు వంద
మంది కలిసి తలా పదివేలు వేసుకొని పది లక్షలకి భూమి కొన్నారు అనుకోండి. అదే భూమి
ఆర్నెల్ల తర్వాత పన్నెండు లక్షలు ఐతే
అప్పుడు ఒక్కొక్కరి షేరు విలువ పన్నెండు
వేలు అవుతుంది. ఈ లోపులో ఒకవేళ ఆ భూమి లో వేసిన వరి పైరు చేతికి వచ్చి లక్ష రూపాయల
ధర అయిందనుకోండి.ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల డివిడెండు వస్తుంది. మొత్తం
మీదా మూడు వేలు లాభం కదా? ఒక్కొక్కరికి. అదే విధంగా కంపెనీ అతుల విలువ కూడా
పెరుగుతుంది.ప్రతి కంపెనీ తన
లాభాలన్నింటిని వాటాదారులకు పంచాడు. కొంత వరకూ రిజర్వులో దాస్తుంది. అది
కూడా మన అస్తే.పైన చెప్పుకున్న ఉదాహరణలో మన కంపెనీ గత ఐదు సంవత్సరాలుగా వచ్చిన
లాభాలను రిజర్వు లో యాభై లక్షల వరకు దాచి పెట్టినది అనుకోండి.అప్పుడు మన పది
రూపాయల షేరు ధర అరవై రూపాయలు అవుతుంది.కొన్నిసమయాలలో కంపెనీ రిజర్వు అమౌంట్ లో
నుండి కొంత మొత్తం మనకి పంచుతుంది. వాటిని మనం బోనస్ షేర్లు
అంటారు.
కంపెనీ కొత్తగా
షేర్లను ఇవ్వడాన్ని పబ్లిక్ ఇష్యూ అంటారు.
కంపెనీ తన వ్యాపరం గురించి, ఇంతకు ముందు కంపెనీ ఉన్నట్టు ఐతే పూర్వపు లాభాల
గురించి , తన ఆస్తులు మొదలగు వాటితో కూడిన వివరాలతో దిన పత్రికలో ప్రకటన
ఇస్తుంది.అప్పుడు మనకు ఆ కంపెనీ గురించిన సమాచారం నచ్చి , నమ్మకం కుదిరితే అప్లయ్ చేయవచ్చు.కొనేవారి సంఖ్యా ఎక్కువగా ఉంటే
లాటరీ తీసి పంచుతారు.పెద్ద కంపెనీ షేర్లు ఈ విధంగా లాటరీ ద్వారా సంపాదించటం
కొద్దిగా కష్టం..ఈ విధంగా పంపకం జరిగాక తమకి సంక్రమించిన షేర్లని కొందరు
అమ్మజూపుతారు.కావలసినవాళ్ళు హెచ్చు ధరకి దాన్ని కొనుక్కోవడాన్ని సెకండరీ మార్కెట్ అంటారు.క్యూ లైన్ లో సినిమా
టికెట్స్ దొరక్కపోతే బ్లాకులో ఎక్కువ ధర పెట్టి కొనుక్కున్నట్టు .
షేరు ధరలు
పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి.ప్రభుత్వం పెట్రోల్ ధర పెంచాగానే ఎక్స్ కెమికల్ కంపెనీ షేర్ల ధర పెరగవచ్చు.దానికి కారణాలు
అన్వేషించాలి అంటే చాలా లింకులు ఆలోచించాలి.పెట్రోలు ధర పెరిగితే బైక్ లకన్నా
లూనాల డిమాండ్ పెరుగుతుంది. లూనాల టైర్లలో
వాడే రసాయనాన్ని ఈ ఎక్స్ కెమికల్ కంపెనీ తయారు చేస్తుంది.అందువలన వచ్చే
సంవత్సరం దీనికి లాభాలు ఎక్కువగా వస్తాయి అన్న ఉద్దేశంతో ఈ కంపెనీ షేరు ధర
పెరుగుతుంది.
ప్రధానమంత్రి
, వాణిజ్య మంత్రిని పదవి నుంచి తొలగించాగానే ఒక
చెప్పుల కంపెనీ ధర విపరీతంగా పడిపోవచ్చు.దానికి , దీనికి లింక్ ఏమిటని
ఆలోచిస్తే
సదరు మంత్రి బావమరిదికి అరబ్ దేశాలకు చెప్పులు ఎగుమతి చేసే లైసన్స్ ఉండి
ఉండవచ్చు.దాని క్రింద లోపాయికారిగా కోట్ల విలువచేసే చెప్పులు ఎగుమతి చేస్తూ
లాభాలు
గడిస్తూ ఉండవచ్చు.ఇకముందు ఈ ఆటలు సాగవు కదా ? అందుకే ఆ కంపెనీ షేరు ధర
పడిపోయింది.
ఈ విధంగా దేశంలో ఎక్కడో ఏదో జరిగితే మరెక్కడో షేరు ధరలు పెరగడమో, తరగాడమో
జరుగుతుంది.కేరళలో వర్షాలు పడితే బొంబాయి కొబ్బరి నూనె కంపెనీ
షేరు ధరపై ఆ ప్రాభావం ఉంటుంది.కార్మిక
సంఘాల స్ట్రయికులు , రాజకీయ అనిశ్చితి, పంటలు, యుద్ధం మొదలగునవి అన్ని
కూడా షేర్ల ధరలపై ప్రభావం
చూపెడతాయి.దేశంలో ఒక చిన్న కదలిక రాగానే అది ఏ కంపెనీ మీదా ఎలాంటి ప్రభావం
చూపిస్తుందో కరెక్ట్ గా
అంచనా వేసి అందరికన్నా ముందుగా దాన్ని
పట్టుకొని దాంతో వ్యాపారం చేసే బ్రోకర్లని స్పెక్యులేటర్లు అంటారు. మనిషి
తెలివి
తేటలకు వీరి మెదళ్ళు పరాకాష్ట. వీరిలో రెండు రకాలు. బుల్ల్స్, బెర్స్.
స్టాక్ మార్కెట్
లో లో వ్యాపారం చేసే వాళ్ళు సాదరణంగా ఈ
రెండు రకాల్లో ఏదో ఒక రకానికి చెందినవారూ అయి ఉంటారు. మార్కెట్ లో వీళ్ళిద్దరూ
ఎప్పుడు యుద్దానికి తలపడే యోదుల్లా ఉంటారు. బుల్ ఆశాజీవి. దేశంలో ఏ చిన్న పరిమాణం
జరిగిన షేరు ధర విపరీతంగా పెరుగుతుంది అనుకొనేవాడు.బెర నిరాశాజీవి.ధర అనుకున్నంతగా
పెరగదని , కొండకచో తగ్గిపోతుంది అని
భావించేవాడు . ఉదాహరణకు జనవరి 1వ తారీఖున కిలో పంచదార 10 రూపాయలు ఉందనుకొందాం. ఆ సంవత్సరం చెరకు
సరిగ్గా పండలేదు అనుకుందాం.మార్చి 31 వ తారీఖు వీరిద్దరూ ఉహించే ధరలు ఈ విధంగా
ఉంటాయి.
జనవరి 1 ధర మార్చి 31ధర
బుల్ 10 16
బేర్
10
12
జనవరి ఒకటో
తారీఖు పొద్దున్నే బుల్ స్వీట్స్ తీసుకొని బేర్
కి నూతన సంవత్సర శుబాకాంక్షలు చెప్పి బేరం మొదలు పెడతాడు. బ్రదర్ మార్చి 31 వ తారీఖు నాటికి నాకు లక్ష కిలోల పంచాదార
కావాలి . కిలో పద్నాలుగు రూపాయల చొప్పున ఆ
రోజు నాటికి ఇవ్వగలవా ? అని అడుగుతాడు.
కొత్త సంవత్సరం
మొదట్లో భలే బేరం తగిలిందని బేర్ సంతోషిస్తాడు.మార్చి 31నాటికి అతడు ఉహిస్తున్న ధర కిలో 12 మాత్రమే. ఆ రోజు పన్నెండుకి కొని పద్నాలుగికి అమ్మితే రెండు
లక్షలు లాభం వస్తుంది అని ఆలోచిస్తాడు.బుల్ ఆలోచనలు వేరు . ఆ రోజు ధర పదహారు
రూపాయలు ఉంటే అతడికి రెండు లక్షలు లాభం.ఈ విధంగా ఇద్దరి మధ్య ఒక్క పంచదార పలుకు
లేకుండా లక్షల వ్యాపారం చేస్తారు.
మరుసటి ఆర్టికల్
లో షేర్ మార్కెట్ లో మోసాలు ఎలా జరుగుతాయి . హర్షద్ మెహతా చేసిన మోసం ఎలాంటిదో తెలుసుకుందాం.
షేర్ మార్కెట్
లో హర్షద్ మెహతా చేసిన మోసం ఏమిటి ?
షేర్ మార్కెట్
లో షేర్ ధరలు ఎందుకు పెరుగుతాయి.?
మీరు ఇంతకు ముందు బుల్ మరియు బేర్ ఒక్క పంచదార పలుకు లేకుండా
లక్షల వ్యాపారరం చేసారు అని తెలుసుకున్నారు కదా ? అయితే దీని మీదనే షేర్ల ధర
ఆధారపడి ఉంటుంది. ఫలానా బుల్ మార్చి 31 వ తారీఖు నాడు
పద్నాలుగు రూపాయలకు లక్ష కిలోల పంచదార
కొంటున్నాడన్న వార్త మార్కెట్ లోకి
పొక్కగానే అతడు ఏయే అంశాలను
దృష్టిలో పెట్టుకొని ఈ రేటు నిర్ణయించడా
అన్నది అందరూ పరిశీలిస్తారు. ఆ
విధంగానే బేర్ లు ఏ నమ్మకం తో ఆ అమ్మకానికి వప్పుకున్నడన్న విషయం లెక్కలు వేస్తారు.ఇరుపక్షాల వైపు అటూ
ఇటూగా విడిపోతారు.ఈ విధంగా ఒక షేరు ధర బుల్ల్స్ మరియు బెర్స్ మధ్య
లావాదేవీలవల్ల నిర్ణయించబడుతుంది. ముందే
చెప్పినట్టు దీని వెనుక అపూర్వమైన తెలివితేటలు , దేశ రాజకీయ , సామాజిక ఆర్ధిక
పరిస్థితులు ఉంటాయి.
మోసం ఎలా
జరుగుతుంది.
జనవరి ఒకటో
తారీఖున మీరు వెళ్లి బేర్ ని మార్చి 31 న నాకు కిలో పద్నాలుగు రూపాయల చొప్పున లక్ష కిలోల పంచదార
కావాలి అన్నారు అనుకోండి. బేర్ దానికి ఒప్పుకున్నారు అనుకోండి. బయట ఎక్కడో
స్నేహితుడి దగ్గర పది లక్షలు అప్పు తెచ్చి
ఆ డబ్బుతో లక్ష కిలోల పంచదార కొనేసి ఆ స్టాక్ బ్యాంక్ లో పెట్టి దాని మీదా పది
లక్షలు అప్పు తీసుకున్నారు అనుకోండి. దాంతో మళ్ళీ ఇంకో లక్ష కిలోల పంచదార కొన్నారు
అనుకోండి. బ్యాంక్ మార్జిన్ లేకుండా అప్పు ఇచ్చినది అనుకుందాం.మీ చర్య వలన ఈ
లోపులో పంచదార డిమాండ్ పెరిగి వారం రోజుల్లో కిలో పంచదార పద్నాలుగు రూపాయలు అవుతుంది. ప్రస్తుతం మీ
దగ్గర రెండు లక్షల కిలోల పంచదార ఉంది. స్నేహితుడి
దగ్గర అప్పుచేసి లక్ష కిలోల పంచదార కొంటే , దానిని బ్యాంక్ లో కుదవ పెట్టి
మరో లక్ష కిలోల పంచదార కొనడం జరిగినది.ప్రస్తుతం ఈ రెండు లక్షల
కిలోల పంచదార విలువ ఇరవై ఎనిమిది లక్షలు.మీ బ్యాంక్ అప్పు పది లక్షలు.మిగితా
విలువకి బ్యాంక్ మళ్ళీ అప్పు ఇస్తుంది.ఆ డబ్బుతో
మీరు మరో 1.25 లక్షల
కిలోల పంచదార కొంటారు. మార్కెట్ లో పంచదార దొరకటం లేదు. కిలో ధర ఇరవై ఐదు
రూపాయలు అయింది. ఇంతలో మార్చి 31మీకు గుర్తుందా
? ఆ రోజు మీకు లక్ష కిలోల పంచదార పద్నాలుగు రూపాయల చొప్పున మీకు సప్లయ్ చేస్తానని
బేర్ మీతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగినది.ప్రస్తుతం ధర ఇరవై ఐదు రూపాయలు. మీతో బేరం
కుదుర్చుకున్న బేర్ బావురుమని ఏడుస్తూ
మీకు పదకొండు లక్షల రూపాయలు ఇచ్చాడు.(25-14 రూపాయలు x లక్ష కిలోలు ) . దాంతో మీరూ మీ స్నేహితుడు
అప్పు తీర్చేసారు. ప్రస్తతం మీ దగ్గర 3.25 లక్ష కిలోల పంచదార ఉంది. దాని ధర కిలోకి 25 చొప్పున 81,25,000 . మీరూ చేస్తున్న వ్యాపారం చూసి బ్యాంక్
చైర్మన్స్ కూడా విస్తూపోయారు. మీరూ తమ
బ్యాంక్ లో లావాదేవీలు పెట్టుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నారు. మీరు వడ్డీ
కరెక్ట్ గా చెల్లిస్తున్నారు. మూడు నెలలో పంచదార కిల్ప్ పది రూపాయలనుండి , పాతిక
రూపాయలు కావడం తో జనం బంగారం దాచుకోవడం బదులు పంచదార వ్యాపారం చేయడం మొదలు
పెట్టారు. పెళ్లాల మంగళ సూత్రాలు అమ్మి పంచదార కొంటున్నారు.దాంతో పంచదార ధర 30 రూపాయలు అయింది
.అంటే ప్రస్తుతం మీ దగ్గర కోటి రూపాయల
విలువగల స్టాక్ ఉంది.దానిని కుదువ పెట్టుకొని బ్యాంక్ మీకు మరో కోటి రూపాయలు అప్పు
ఇచ్చినది.మీరు మరో 3.30 లక్షల కిలోల పంచదార కొన్నారు.దానిని కూడా బ్యాంక్ కి కుదవ
పెట్టారు. కానీ బ్యాంక్ చైర్మన్ ఇక్కడే పొరపాటు చేసాడు. సెక్యురిటీ కరెక్ట్ గానే ఉంది. 3.30 లక్షల కిలోల పంచదార
కోటీ రూపాయలు అనుకునాడు . దాని ధర కిలో 30 రూపాయలు
అనుకున్నాడు. దాని అసలు ధర కిలో పది రూపాయలు అని, మీ వలెనే కిలో 30 రూపాయలకి పెరిగినది అనే విషయం
మర్చిపోయాడు.ఒకరోజు దురద్రుస్టావశాత్తు ఈ
విషయం రిజర్వు బ్యాంక్ నోటిసుకి వచ్చినది.కంగారు పది లెక్కలు సరిచూసుకుంటే కిలో
పది రూపాయల చొప్పున 6000 కోట్ల నికర విలువగల పంచాదారకి బ్యాంక్ 11480కోట్లు అప్పు
ఇచ్చినట్టు తేలింది. తేడా 5480. ఈ విధంగా
చేతిలో నయా పైసాలేకుండా ఒక వ్యక్తీ
పంచాదారలాంటి షేర్లతో ఐదు
సంవత్సరాలాలో 5480 కోట్లు
సంపాదించాడు. ఆ వ్యక్తే హర్షద్ మెహతా THE BIG BULL.
కొన్నేళ్ళ
క్రితం చుక్కాని లేని నావలా బొంబాయి
వీధుల్లో తిరిగిన హర్షద్ మెహతా , పన్నెండు వందల రూపాయలకి చిన్న అసిస్టెంట్ గా ఉద్యోగం
చేసిన మెహతా , కోట్ల విలువ చేసే బంగాళాలో ఉంటూ
, ఖరీదైన కారలలో తిరుగుతూ చివరకు జైలు
పాలు అయ్యి జైలులోనే గుండె పోటూతో
మరణించడం జరిగినది.ఇక్కడ పంచదార కేవలం మీకు సాదారణ బాషలో సులభంగా అర్ధం కావడానికి
తీసుకోవడం జరిగినది. వాస్తవంగా పంచదార బదులు షేర్లు లెక్కలోకి తీసుకోవాలి. మీకు ఈ
విషయం పూర్తీగా అర్ధం కావలి అంటే ఇంతకు ముందు రెండు భాగాలు కూడా చదివితే సులభంగా
అర్ధం అవుతుంది.