WHAT IS ONLINE TRADING?


ట్రేడింగ్ లో రకాలున్నాయి. ఫారెక్స్ ట్రేడింగ్, స్టాక్ ట్రేడింగ్, కమోడిటీ ట్రేడింగ్ మొ.వి

ఫారెక్స్ ట్రేడింగ్ లో USD (United State Dollar), GBP (Great Briton Pound), JPY (Japan Yen) మొదలైనవి ట్రేడింగ్ జరుగుతాయి అంటే ఒక కరెన్సీని ఇంకో కరెన్సీతో కొనడం అమ్మడం ద్వారా లావాదేవీలు (ట్రేడింగ్) జరుపుకోవడం

స్టాక్ ట్రేడింగ్ అంటే  షేర్స్ కొనడం, అమ్మడం.

కమోడిటీ ట్రేడింగ్ అంటే వస్తువులు కొనడం, అమ్మడం, అంటే గోల్డ్, సిల్వర్, మెటల్స్ మొదలైనవి.

ఆన్లైన్ కమోడిటీ ట్రేడింగ్ లో కొనుగోలు, అమ్మకాలు అంటే ఇక్కడ నిజంగా భౌతికంగా కొనుక్కోవడం కాదు. ఇంటర్నెట్ ద్వారా సంబంధిత లావాదేవీలు జరిపి వ్యాపారం (Trading ) చెయ్యడం. అంటే buy ఆర్డర్, sell ఆర్డర్ ఇవ్వడం ద్వారా ఒక పొజిషన్ తీసుకుని ఆ తర్వాత లాభ / నష్టాలతో ముందున్న పొజిషన్ నుండి ఎగ్జిట్ అవ్వడం అన్నమాట. అసలు ఈ ఆన్లైన్ ట్రేడింగ్ పుట్టుపూర్వోత్తరాలు, ప్రారంభించిన తేదీలు చెప్పేటంత లోతు లోకి మనం వెళ్ళడం లేదు. బిగినర్స్ కు దీని గురించి అవగాహన కోసం మళ్ళీ ఒక్కసారి ఇక్కడ క్లుప్తంగా వివరించే ప్రయత్నం ఇది.
ACCOUNT OPENING PROCESS:

మీరు తరుచుగా వినే రూపాయి విలువ పతనం కావడం అంటే అర్ధం ఏమిటి ?








డాలర్ తో పోలిస్తే రూపాయి  విలువ తగ్గడం గురుంచి ఈ మధ్య మీరందరూ తరుచుగా వింటూనే ఉన్నారు.ఈ మధ్య డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 57.32 చేరుకోవడం మీకు తెలిసే ఉంటుంది.. అసలు రూపాయి పతనం అంటే ఏమిటో ఒక్క సారి చూద్దాం. మార్కెట్ లో ఏదైనా ఒక వస్తువు ధర పడిపోయినప్పుడు దానిని కనుగోలు చేయాలి అనుకున్న వ్యక్తీ తక్కువ ధర చేల్లిస్తాడు అనే విషయం మీకు తెలుసుకదా ? అదే విధంగా  భారత దేశంలో నివసిస్తున్న మనం రూపాయిని  కనుగోలు చేయలేము. మనం ,మనకు కావలసిన రూపాయలను జీతం ద్వారా,  మనం అందించిన సేవల ద్వారా మాత్రమే పొందగలం.కాని మీరు ఒక్కసారి ఆలోచించండి.  విదేశాల నుండి మనం దేశానికి వచ్చే టూరిస్టులు కాని, విదేశాలలో ఉన్న మన బందువులు కాని మనకు డబ్బు పంపాలి అంటే  వారూ మన దేశ రూపాయిని కనుగోలు

ఆషామాషీ గా మదుపు చేయకండి


మార్కెట్ లో లాభ సాటి షేర్లను గుర్తించి మదుపు చేస్తే  నష్ట పోయే అవకాశాలు తక్కువగా వుంటాయి అయితే లాభ సాటి షేర్లను గుర్తించడం అంతా సులభమైన విషయం కాదు. ఇక్కడే మన శక్తి సామర్ధ్యాలు బయట పడతాయి. మంచి షేర్లను గుర్తించడానికి నిరంతర పరిశీలన అవసరం. మార్కెట్ లో ప్రతి పరిణామాన్నిగమనిస్తుండాలి.ఆర్ధిక ఫలితాలను పరిశీలిస్తుండాలి.అందుకు కొంత సమయం కేటాయించాలి .ఓర్పుగా మార్కెట్ కి సంబంధించిన ప్రతి అంశాన్ని అధ్యయనం  చేయాలి.చిన్న ఇన్వెస్టర్లు సహజం గా అంతా ఓపిక చూపరు.కొందరైతే ఏమాత్రం కష్ట పడకుండా అలా మదుపు చేస్తే ఇలా లాభాలు రావాలని కోరు కుంటారు. ఆలాంటి వాళ్ళలో కొద్దిమంది లబ్ది పొందినా అధిక  భాగం

షేర్ మార్కెట్ లేదా స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి ?

షేర్ మార్కెట్ లేదా స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి ?

షేర్ అంటే వాటా లేదా భాగం అని అర్ధం. అంటే మీరు ఏదైనా ఒక కంపెనీ షేర్  కొంటున్నారు అంటే ఆ కంపెనీలో భాగం కొంటున్నారు అని అర్ధం.దీనిని  మనం ఒక ఉదాహరణ ద్వారా అర్ధం చేసుకొనే ప్రయత్నం చేద్దాం.
ఒక యువ జంట ఒక వ్యాపారం చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. వారికి మంచి రుచికరమైన , రకరకాలైన ఐస్ క్రీం లు తయారు చేయడంలో  మంచి ప్రావీణ్యం ఉంది. కాబట్టి వారూ ఐస్ క్రీం పార్లర్ ప్రారంభించారు. దానికి వారూ రోజీ ఐస్ క్రీం పార్లర్ అనే పేరు పెట్టడం జరిగినది. వారూ ఈ వ్యాపారం చేయడానికి కావలసిన డబ్బు బ్యాంక్ వద్ద అప్పు తీసుకొని ప్రారంభించడం జరిగినది. వారి వ్యాపారం వారూ అనుకున్నట్టుగానే  బాగా వృద్ది లోకి రావడం జరిగినది.మంచి లాభాలు కూడా పొందుతున్నారు. వస్తున్న లాభాలతో పెరుగుతున్న కస్టమర్లకు అనుగుణంగా  ఐస్ క్రీం లు తయారు చేయడానికి కావలసిన  మేటిరీయల్ కొనడానికి వస్తున్న లాభాలు ఉపయోగిస్తున్నారు.
స్టాక్ మార్కెట్ పరిచయం

రేపటి జీవనం ఎలాంటి ఒడిదోడుకులులేకుండా సాగాలంటే భవిష్యత్తు లో వచ్చే ఆదాయం కోసం  మనం సంపాదించిన సంపదలో మన ఖర్చులు పోగా మిగిలిన సంపదను  పెట్టుబడిగా పెట్టి మరింత సంపదను పొందడమే పెట్టుబడి . ఈ పెట్టుబడి అనునది మనం స్తిరాస్తి , బ్యాంకు డిపాజిట్లు, వడ్డీ ఆదాయం , అద్దె ఆదాయం , షేర్స్ ,మ్యూచువల్ ఫండ్స్,బాండ్స్, సేవింగ్ సర్టిఫికేట్లు, వివిధ పోస్ట్ ఆఫీసు ఫథకాలు, బంగారారం  మొదలగు వాటిలో పెడతాం .
మన పెట్టుబడి ఒక్క ముఖ్య ఉద్దేశం  సంపద సృష్టించడం , దానితో పిల్లల కళాశాల ఫీజులు. పెళ్ళిల్లు, సెలవులలో  సరదాగా  గడపడం, మంచి జీవన ప్రమాణానికి,రిటైర్మెంట్ తర్వాత జీవితం సాపీగా జరుగుటకు , మీ అనంతరం ఈ సంపద మీ తరాల వారికి  చేర్చటం.ఈ పెట్టుబడి వల్ల వచ్చే  రాబడి పెరుగుతున్న  ద్రవ్యోల్బణం  కంటే అధికంగా ఉండాలి. ఎప్పుడైనా సరే సంపదను కాపాడటం మరియు దానిని అభివృద్ధి చేయడం అనేది ఒక్క కళ.

షేర్ మార్కెట్ లేదా స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి ?


షేర్ మార్కెట్ లేదా స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి ?
షేర్ అంటే వాటా లేదా భాగం అని అర్ధం. అంటే మీరు ఏదైనా ఒక కంపెనీ షేర్  కొంటున్నారు అంటే ఆ కంపెనీలో భాగం కొంటున్నారు అని అర్ధం.దీనిని  మనం ఒక ఉదాహరణ ద్వారా అర్ధం చేసుకొనే ప్రయత్నం చేద్దాం.
ఒక యువ జంట ఒక వ్యాపారం చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. వారికి మంచి రుచికరమైన , రకరకాలైన ఐస్ క్రీం లు తయారు చేయడంలో  మంచి ప్రావీణ్యం ఉంది. కాబట్టి వారూ ఐస్ క్రీం పార్లర్ ప్రారంభించారు. దానికి వారూ రోజీ ఐస్ క్రీం పార్లర్ అనే పేరు పెట్టడం జరిగినది. వారూ ఈ వ్యాపారం చేయడానికి కావలసిన డబ్బు బ్యాంక్ వద్ద అప్పు తీసుకొని ప్రారంభించడం జరిగినది. వారి వ్యాపారం వారూ అనుకున్నట్టుగానే  బాగా వృద్ది లోకి రావడం జరిగినది.మంచి లాభాలు కూడా పొందుతున్నారు. వస్తున్న లాభాలతో పెరుగుతున్న కస్టమర్లకు అనుగుణంగా  ఐస్ క్రీం లు తయారు చేయడానికి కావలసిన  మేటిరీయల్ కొనడానికి వస్తున్న లాభాలు ఉపయోగిస్తున్నారు.

వారూ వ్యాపారం ప్రారంభించి సుమారు  పది సంవత్సరాల కాలం గడిచిపోయింది. వారూ చేసిన బ్యాంక్ అప్పు కూడా తీర్చివేయడం జరిగినది.వారూ  ఇప్పుడు సంవత్సరానికి  రూ. 10 లక్షలు లాభం పొందుతున్నారు. అంతే కాకుండా  వారి రోజీ ఐస్ క్రీం పార్లర్” యొక్క బుక్ వాల్యూ కూడా రూ.50 లక్షల వరకూ ఉంది.( బుక్ వాల్యూ అంటే రోజీ ఐస్ క్రీం పార్లర్” వాస్తవిక విలువ  machinery, furniture, building less any loans ).వారూ ఇప్పుడు వారి వ్యాపారాన్ని ప్రక్కన ఉన్న పట్టణాలకు కూడా విస్తరించాలి అనుకుంటున్నారు. అందువలన ప్రక్కన గల పట్టణంలో రెండు బ్రాంచీలు ప్రారంభించాలి అనుకున్నారు.దానికి వారూ తగిన రిసెర్చ్ చేస్తే మరో రెండు బ్రాంచీలు ప్రారంభించడానికి  రూ .52 లక్షలు అవసరం అవుతున్నాయి.ఈ విధంగా వారికి కావలసిన రూ .52 లక్షలు సమకూర్చుకోవడానికి వారికి రెండు అవకాశాలు  అందుబాటులో ఉన్నాయి.మొదటిది బ్యాంక్ ల నుండి అప్పు తీసుకోవడం , రెండవది వారి వ్యాపారం నుండి కొంత వాటా ఇతరులకు అమ్మడం.బ్యాంక్ వడ్డీ రెట్లు అధికంగా ఉన్నందున వారూ వారి వ్యాపారంలో వాటా అమ్మడానికే  మొగ్గు చూపారు. కాని వారి మదిలో ఎన్నో అనుమానాలు . ఏవిధంగా వాటా అమ్మాలి. “రోజీ ఐస్ క్రీం పార్లర్యొక్క విలువ యే విధంగా లెక్కించాలి. షేర్ ధర యే విధంగా నిర్ణయించాలి.ఎవరు వాల్యుయేషన్ చేస్తారు మొదలగు సందేహాలు కలవు.
రోజీ ఐస్ క్రీం పార్లర్లో కొంత వాటా అమ్మాలి  అంటే  ఆ పార్లర్  యొక్క విలువ లెక్కించాలి. కంపెనీ విలువ లెక్కించే వ్యక్తిని underwriter’.అంటారు .అతను రోజీ ఐస్ క్రీం పార్లర్ యొక్క గత రికార్డులు. భవిష్యత్ అవకాశాలు, ఆ పార్లర్ ఓనర్స్ ఇంటువంటి యువజంట యొక్క బ్యాక్ గ్రౌండ్ మొదలగునవి పరిశీలించి ఈ పార్లర్ దాని సంవత్సర లాబాలకంటే పది రెట్లు విలువ చేస్తుంది అని నిర్దారించడం జరిగినది, అంటే దాని అర్ధం పార్లర్ పొందుతున్న లాభం రూ 10 లక్షలు కాబట్టి దానికి పది రెట్లు అంటే పార్లర్ కోటి రూపాయల విలువ చేస్తుంది అని దాని అర్ధం.దానికి బుక్ వాల్యూ అదనం. అంటే రోజీ ఐస్ క్రీం పార్లర్మొత్తం కోటి యాభై లక్షల విలువ లేదా 150 లక్షల విలువ చేస్తుంది అని నిపుణుడి అభిప్రాయం. రూ 150 లక్షలలో 40% అంటే 60లక్షలు కాబట్టి వారూ వారికి కావలసిన   52 లక్షలు పొందడానికి రోజీ ఐస్ క్రీం పార్లర్లో  40% వాటా పబ్లిక్ కి  అమ్మడానికి నిర్ణయించుకున్నారు. ఈ విధంగా  మొదటి సారిగా ఒక కంపెనీ పబ్లిక్ కి వారా అమ్మడాన్ని ఐ పి ఒ  అంటారు. ఈ విధంగా వారి  రోజీ ఐస్ క్రీం పార్లర్లో  40% వాటా పబ్లిక్ కి  అమ్మడం ద్వారా వచ్చిన డబ్బు  60లక్షల నుండి రూ 52 లక్షలు రెండు రోజీ ఐస్ క్రీం పార్లర్” బ్రాంచీలు ఓపెన్ చేయడానికి ఉపయోగించి మిగితా రూ 8 లక్షలు రోజు వారి వ్యవహారాలు సజావుగా నడవడానికి ఉపయోగించేవారు. “రోజీ ఐస్ క్రీం పార్లర్లో మెజారిటీ వాటా 60% యువ జంట చేతిలోనే ఉండటంతో పార్లర్ పై అజమాయిషీ కూడా వారి వద్దనే ఉంటుంది. ఈ విధంగా మొదటి సారి ఒక కంపెనీ పబ్లిక్ కి వాటా అమ్మడాన్ని ప్రైమరీ మార్కెట్ అంటారు.

ఇప్పుడు  “రోజీ ఐస్ క్రీం పార్లర్మూడు బ్రాంచీలను కలిగి ఉండి  ప్రతి బ్రాంచీ  రూ 10 లక్షల లాభం సంపాదిస్తుంది. అంటే మూడు బ్రాంచీలు కలిపి సంవత్సరానికి 30 లక్షల లాభం రోజీ ఐస్ క్రీం పార్లర్” పొందుతుంది.ఇప్పుడు రోజీ ఐస్ క్రీం పార్లర్” విలువ 450 లక్షలు. ఇది వరకే ఒక రోజీ ఐస్ క్రీం పార్లర్యొక్క విలువ 150 లక్షలు గా లెక్కించడం జరిగినది.ఇప్పుడు మూడు బ్రాంచీల విలువ కలిపి 450 లక్షలు (3 shops x 10 lakhs x 10 times + 50 lakhs x 3). అదే విధంగా యువ జంట 60% వాటా మొత్తం  270 లక్షలు (450 x 60%). అదే విధంగా 60 లక్షలు పెట్టి 40% వాటా కొన్న పబ్లిక్ వాటా విలువ రూ 180 లక్షలు. అంటే వారి వాటా విలువ కూడా మూడు రెట్లు పెరగడం జరిగినది.

ఇప్పటి వరకు మీకు వివరంగా అర్ధం అయింది అనుకుంటాను. ఇప్పుడు స్టాక్ మార్కెట్ దగ్గరకు వద్దాం..ఇప్పుడు పబ్లిక్ వద్ద ఉన్న  40% వాటా తరుచుగా చేతులు మారడం జరుగుతుంది. ఈ విధంగా చేతులు మారే ప్రదేశాన్ని సెకండరీ మార్కెట్ అంటారు. సెకండరీ మార్కెట్ లో రోజీ ఐస్ క్రీం పార్లర్యొక్క వాటాలను అధిక ధరకు కొనడానికి కూడా పబ్లిక్ తయారుగా ఉన్నారు. ఎందుకంటె అది మంచి పనితీరు కనబరుస్తుంది కాబట్టి. మీరు ఒక ఇన్వెస్టర్ గా  రోజీ ఐస్ క్రీం పార్లర్లో ఇన్వెస్ట్ చేయడం అంటే వాటా కనుగోలు చేయడం వలన లాభం యే విధంగా కలుగుతుందో ఒక్కసారి చూద్దాం.  రోజీ ఐస్ క్రీం పార్లర్మొత్తం  వాటాలను 50000 విభజించారు అనుకుందాం . దానిలో 40% వాటాలను  పబ్లిక్ కి అంటే 20000  వాటాలను కేటాయించారు. పబ్లిక్ దగ్గర  నుండి  ఈ 20000 వాటా ల ద్వారా సేకరించిన మొత్తం రూ 60 లక్షలు కదా ? అంటే ఒక వాటా ద్వారా సేకరించిన మొత్తం రూ 300 (60 lakhs/20000) కాని ఇప్పుడు ఒక్కో వాటా విలువ రూ 900 ఎందుకంటె ఇప్పుడు పబ్లిక్ వాటా విలువ రూ 180 లక్షలు ( 180 lakhs / 20000) ఇప్పుడు మొత్తం  రోజీ ఐస్ క్రీం పార్లర్” విలువ 450 లక్షలు (3 shops x 10 lakhs x 10 times + 50 lakhs x 3). అదే విధంగా యువ జంట 60% వాటా మొత్తం  రూ 270 లక్షలు (450 x 60%). అదే విధంగా రూ 60 లక్షలు పెట్టి 40% వాటా కొన్న పబ్లిక్ వాటా విలువ రూ 180 లక్షలు.అని మీరు ఇదివరకే తెలుసుకున్నారు.ఈ విధంగా  రోజీ ఐస్ క్రీం పార్లర్వాటా విలువ  పార్లర్ పనితీరు ఆధారంగా పెరుగుతుంది.పని తేరు బాగా లేకపోతే తగగ్డం కూడా సర్వ సాదారణం.
ఒకవేళ  రోజీ ఐస్ క్రీం పార్లర్వాటా లేదా షేర్  విలువ రూ 1250 కి చేరితే మీరు వాటా కొనుగోలు చేస్తారా ? చేయవద్దు. ఎందుకంటె మనం ఇది వరకే తెలుసుకున్నాం. “ రోజీ ఐస్ క్రీం పార్లర్వాస్తవ విలువ రూ 900 మాత్రమే అనుకున్నాం.దీనినే రియల్ వాల్యూ లేదా ఇంట్రిస్టిక్ వాల్యూ అంటారు. అంత కంటే అధిక ధర ఉంటే కంపెనీ షేర్ అధిక ధర ఉన్నట్టుగా భావించాలి.
ఒకవేళ  రోజీ ఐస్ క్రీం పార్లర్వాటా లేదా షేర్  విలువ 750 కి చేరితే మీరు వాటా కొనుగోలు చేస్తారా ? తప్పకుండా చేయాలి. ఎందుకంటారా ? స్టాక్ మార్కెట్ పతనం ద్వారా వాటా విలువ తగ్గిపోయి తక్కువ ధరకు దొరుకుతుంది కాని , షేర్ వాస్తవిక విలువ  రూ 900 కాబట్టి కొనడంలో ఎలాంటి తప్పు లేదు.ఐతే మల్లె ఎక్కడ అమ్మాలి అంటారు. వాస్తవిక విలువ ఐనటువంటి  రూ 900 లేదా దాని పైన అమ్మాలి . ఇక్కడ నేను మీకు ఉదాహరణగా   రోజీ ఐస్ క్రీం పార్లర్” తీసుకోవడం జరిగినది. మీరు ఏదైనా కంపెనీ ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈ విధంగా వాస్తవికి విలువ కంటే తక్కువగా ఉండి  మంచి పని తీరు కనబరుస్తున్న షేర్స్ లో ఇన్వెస్ట్ చేయడం ఎప్పుడూ కూడా మంచిది. మరో సారి మరొక్క టాపిక్ గురుంచి తెలుసుకుందాం.

సెన్సెక్స్ ఎంత పడితే అంత మంచిది

మార్కెట్ ఎంత పడితే మళ్ళీ అంతా పైకి లేస్తుంది.
పెరుగుట విరుగుట కొరకే అన్న సూత్రం స్టాక్ మార్కెట్ కి
అక్షరాలా వర్తిస్తుంది. సెన్సెక్స్ యే స్థాయికి పడిపోయిన మళ్ళీ ఉత్తుంగ తరంగం లా లేస్తుంది.కాబట్టి ఇన్వెస్టర్లు కంగారు పడాల్సిన అవసరమే లేదు.
ప్రస్తుతం సెంటిమెంట్ బాగా లేదు కాబట్టి  కొత్త లేదా చిన్న ఇన్వెస్టర్లు  కొనుగోళ్లకు దూరం గా ఉండటమే మేలు . సెంటిమెంట్ మెరుగు పడే వరకు ఓపిక పట్టక తప్పదు.
కాక పోతే  ఈ పతన దశలో మార్కెట్ గమనాన్ని పరిశీలిస్తుండాలి.  ఇన్వెస్ట్ మెంట్ వ్యూహాలను
రూపొందించుకోవాలి. కంపెనీల షేర్ల ధరలపై  సెంటిమెంట్ ప్రభావం ఎలా ఉంది ?
షేర్ల ధరలు తగ్గాయా ??లేక పెరిగాయా?? ఒక అంచనాకు రావాలి. పని తీరు, ఫలితాలు బాగుండి, షేర్ ధర కూడా తగ్గి వుంటే అలాంటి షేర్లను ఎంపిక చేసి పెట్టు కోవాలి.మార్కెట్  స్థిరీకరణ బాట పట్టాక కొనుగోళ్ళకు  పూనుకోవాలి.
మార్కెట్ పతన మౌతున్నదంటే అది ఇన్వెస్ట్ మెంట్ కి అవకాశం దొరకడమే అని భావించాలి. మార్కెట్ ఇప్పటికి కొన్ని వందల సార్లు పతన మైంది మళ్ళీ పెరిగింది.
ఇక ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన షేర్లలో మదుపు చేసిన ఇన్వెస్టర్లు కూడా
నష్టాల నివారణకు  ప్రయత్నం చేయ వచ్చు. కొనుగోలు చేసిన షేర్లను  మళ్ళీ కొనుగోలు చేసి యావరేజ్ చేసుకోవాలి . లేదంటే  యే ప్రయత్నం చేయకుండా
ఉండటమే మంచిది.  కాగా  రిస్క్ తీసుకునే సత్తా వున్నా ఇన్వెస్టర్లు మాత్రం ధరలు తగ్గిన షేర్ల పై ఒకన్నేయ వచ్చు.

దీర్ఘకాలం లోనే "సిప్ " తో లాభాలు

"సిప్ "అనే పదం ఇటీవల కాలం లో తరచుగా వింటున్నాం.చాలా మంది "సిప్ "అన గానే అదేదో ఒక స్కీం అని భావిస్తుంటారు .కానీ సిప్ అంటే మదుపు చేసే పద్ధతి.  సిష్టమేటిక్  ఇన్వెస్ట్మెంట్  ప్రోసీజర్  దీన్నే తెలుగులో క్రమానుగత పెట్టుబడి విధానం అంటారు. దీర్ఘ కాలిక వ్యూహం తో మదుపు చేసే ఇన్వెస్టర్ లకు సిప్ చాలా అనువైనది.రికరింగ్ డిపాజిట్ తరహాలోనే నెలకు నిర్ణీత మొత్తాన్ని  మదుపు చేయడాన్ని సిప్ అంటారు .  బ్యాంకుల్లో ,పోస్ట్ ఆఫీసుల్లో మదుపు చేస్తే రికరింగ్ అంటాం. అదే మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేస్తే సిప్ అంటాం .అంతకు మించి  పద్దతిలో తేడా లేదు. అయితే రికరింగ్ లో వడ్డీ గ్యారంటీ వుంటుంది. సిప్ లో ఆ గ్యారంటీ లేదు. ఇన్వెస్టర్లు  ఆ విషయాన్నీ గమనించాలి.మ్యూచువల్ ఫండ్స్  సమీకరించిన మొత్తాలను  షేర్ల లో మదుపు చేస్తాయి కాబట్టి కొంత మేరకు నష్ట భయం వుంటుంది.  అందుకే రాబడికి ఫండ్స్ ఎలాంటి హామీలు ఇవ్వవు. అలాంటపుడు సిప్ చేయడమెందుకు అనే సందేహం కూడా రావచ్చు.షేర్ మార్కెట్లో నేరుగా మదుపు చేయలేని ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ లో   మదుపు చేస్తుంటారు , ఫండ్స్ ను మార్కెట్ లో అనుభవం గల నిపుణులు  నిర్వహిస్తారు కాబటి నష్టం తక్కువ  ఉంటుందనే నమ్మకం తోనే ఫండ్స్ వైపు మొగ్గు చూపుతుంటారు. ఈ ఫండ్స్ లో కూడా మంచి వాటిని ఎంచుకొని మదుపు చేస్తే లాభాలు ఆర్జించే అవకాశాలు పుష్కలం గా వున్నాయి.అయితే చిన్న ఇన్వెస్టర్లు పెద్ద మొత్తాల్లో మదుపు చేయ లేరు కాబటి నెల వారీ గా మదుపు చేసేందుకు సిప్
విధానం అమలు లో కొచ్చింది. దీర్ఘ కాలం మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేస్తే లాభాలకు ఛాన్స్ ఉంది. అయితే పధకాల ఎంపిక పైనే లాభాలు ఆధార పడివుంటాయి.ఒకే సారి పెద్ద మొత్తం లొ మార్కెట్  పెట్ట కుండా కొద్ది పాటి మొత్తాల్లో క్రమం తప్ప కుండా మదుపు చేయాలి .ఇన్వెస్టర్ల వీలును బట్టి రూ. 500 ,1000 ,2000మేరకు నెల నెలా మదుపు చేయవచ్చు.ఈ విధానం లొ ముందుగా ఖచ్చితం గా ఏమేరకు మదుపు చేయ గలరో ఇన్వెస్టర్లు నిర్ణయించుకుంటే మంచిది.
ఎంత కాలం మదుపు చేస్తారనేది కూడా ముందుగా నిర్ణయించు కోవాలి .కనీసం మూడు నుంచి అయిదేళ్ళు వ్యవధి వరకు మదుపు చేస్తే లాభాలకు అవకాశం వుంటుంది .కాగా సిప్ పద్ధతి ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లొ మదుపు చేయాలనుకునే ఇన్వెస్టర్లు  యే మ్యూచువల్ ఫండ్ సంస్థ కార్యాలయానికి వెళ్ళిన మిగతా విషయాలు వాళ్ళే చూసుకుంటారు. అయితే ముందుగా నిపుణుల  సలహా తీసుకుంటే మంచిది .

నజరైన లాభాలకు నాలుగు ఫండ్ స్కీమ్స్ .

 స్టాక్ మార్కెట్ లో నేరుగా పెట్టుబడి పెట్టేందుకు సాహసం చేయ లేని ఇన్వెస్టర్లకు మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్ అనువైనవి.మ్యూచువల్ ఫండ్   మేనేజర్స్సమీకరించిన నిధులను వ్యూహాత్మకంగా ఈక్విటీ లలోను ఇతర పెట్టుబడి సాధనాల్లోను మదుపు చేస్తారు.
మార్కెట్ ట్రెండ్స్ గురించి తెల్సిన విశ్లేషకుల సహాయం తో మదుపు చేస్తారు కాబట్టి నష్టాలకు అవకాశం తక్కువగా వుంటుంది .మార్కెట్ విశ్లేషకులు ఇచ్చే సూచనల మేరకు అవసరమైన సందర్భాలలో పెట్టుబడులను మారుస్తుంటారు.పెట్టు బడి పెట్టిన మొత్తాలకు నష్టం వాటిల్ల కుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు.
స్టాక్ మార్కెట్ గురించి ఏమీ తెలియని ఇన్వెస్టర్లు కూడా ధైర్యం గా ఈ ఫండ్స్ లో మదుపు చేయ వచ్చు. అందుకే ఫండ్స్ కి ఆదరణ పెరుగుతోంది.వందల కొద్ది స్కీమ్స్ వస్తున్నాయి. వీటిలో మంచి వాటిని చూసి ఎంచు కుంటే
లాభాలు గడించే అవకాశాలు వుంటాయి. ఈ ఫండ్స్ లో  "సిప్ "విధానం లో కూడా మదుపు చేయవచ్చు.

షేర్లు ట్రేడ్ అవుతున్నాయో ?లేదో ?గమనిస్తుండాలి



స్టాక్ మార్కెట్ లో మదుపు చేసే వారు ఎప్పటి కపుడు తమ వద్ద వున్న షేర్ల స్తితి గతులు గురించి తెలుసు కుంటుండాలి.విశ్లేషకులు చెప్పారు కదా అని దీర్ఘ కాలిక వ్యూహం తో షేర్లను కొని వాటి సంగతి మర్చిపోకూడదు.
ఇప్పుడు 
లావాదేవీలు అన్నీ ఎలక్ట్రానిక్  రూపంలో జరుగుతున్నాయి కాబట్టి షేర్లను కొనుగోలు చేయగానే డీ మ్యాట్ ఖాతా కు మార్పించు కోవడం మంచిది .కొంత మంది ఇన్వెస్టర్లు డీమ్యాట్ ఖాతా ఉన్నప్పటికీ బ్రోకర్ దగ్గరే ఎక్కువకాలం షేర్లను ఉంచుతారు.ఇది మంచి పద్ధతి కాదు.ఫీజు భారం ఉన్నప్పటికీ షేర్లు మన డీమ్యాట్ ఖాతాలో వుంటే షేర్లకు భద్రత వుంటుంది.షేర్ తాలుకు కంపెనీ డివిడెండ్ ,బోనస్ ప్రకటిస్తే అవి మనకే అందుతాయి.కాబట్టి ఎక్కువ కాలం షేర్లను హోల్డ్ చేయాలనుకునే ఇన్వెస్టర్లు షేర్లను కొనగానే  డీమ్యాట్ ఖాతాలోకి మారిపించుకోవడం మంచిది. షేర్లు డీ మ్యాట్ లో ఉన్నంత మాత్రాన  ఇక నిర్భయం గా ఉండొచ్చుఅనుకోవడం కూడా పొరపాటే. 
షేర్లను డీమ్యాట్ లో వుంచి మరచి పోవడం కూడా ప్రమాదమే.కొనుగోలు చేసిన షేర్లు ట్రేడ్ అవుతున్నాయా ?లేదా ఇన్వెస్టర్లు చెక్ చేసుకోవాలి. చాలా కంపెనీలు  మఖలో పుట్టి  పుబ్బలో

స్టాక్ మార్కెట్ పరిచయం

రేపటి జీవనం ఎలాంటి ఒడిదోడుకులులేకుండా సాగాలంటే భవిష్యత్తు లో వచ్చే ఆదాయం కోసం  మనం సంపాదించిన సంపదలో మన ఖర్చులు పోగా మిగిలిన సంపదను  పెట్టుబడిగా పెట్టి మరింత సంపదను పొందడమే పెట్టుబడి . ఈ పెట్టుబడి అనునది మనం స్తిరాస్తి , బ్యాంకు డిపాజిట్లు, వడ్డీ ఆదాయం , అద్దె ఆదాయం , షేర్స్ ,మ్యూచువల్ ఫండ్స్,బాండ్స్, సేవింగ్ సర్టిఫికేట్లు, వివిధ పోస్ట్ ఆఫీసు ఫథకాలు, బంగారారం  మొదలగు వాటిలో పెడతాం .
మన పెట్టుబడి ఒక్క ముఖ్య ఉద్దేశం  సంపద సృష్టించడం , దానితో పిల్లల కళాశాల ఫీజులు. పెళ్ళిల్లు, సెలవులలో  సరదాగా  గడపడం, మంచి జీవన ప్రమాణానికి,రిటైర్మెంట్ తర్వాత జీవితం సాపీగా జరుగుటకు , మీ అనంతరం ఈ సంపద మీ తరాల వారికి  చేర్చటం.ఈ పెట్టుబడి వల్ల వచ్చే  రాబడి పెరుగుతున్న  ద్రవ్యోల్బణం  కంటే అధికంగా ఉండాలి. ఎప్పుడైనా సరే సంపదను కాపాడటం మరియు దానిని అభివృద్ధి చేయడం అనేది ఒక్క కళ.

ఈక్వీటీ మరియు డేట్ కి మధ్యగల తేడా ఏమిటి ?

ఆర్ధిక అక్షరాస్యత సాదించే సమయంలో ఎదుర్కొనే చాలా  బేసిక్ ప్రశ్న ఇది. చాలా మంది షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కాని వారికి కూడా చాలా మందికి అతి బేసిక్ ప్రశ్న ఈక్విటీ అంటే ఏమిటి ? డేట్ లేదా ఋణ పత్రం అంటే ఏమిటో తెలియదు.ఈ ఆర్టికల్ ద్వారా మీరు ఈక్వీటీ మరియు డేట్ అంటే ఏమిటి? వాటి మధ్య గల తేడా ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం.
ఈక్వీటీ అనగా షేర్లు లేదా వాటా అని అర్ధం అంటే మీరు ఒక కంపెనీలో ఈక్వీటీ తీసుకుంటున్నారు అంటే మీ ఈక్వీటీ విలువకి అనుగుణంగా మీరు ఆ కంపెనీలో యాజమాన్యుపు హక్కును పొందుతారు. మీరు ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు అనుకోండి. దానిని వంద సమానభాగాలు లేదా ముక్కలుగా  చేసి మీ వద్ద 51% భాగాలు లేదా ముక్కలు ఉంచుకొని మిగితా భాగాలు లేదా ముక్కలు ఇతరులకు ఇచ్చేసారు అనుకోండి. ఈ

వార్షిక నివేదిక లేదా అన్యూవల్ రిపోర్ట్ అనగా ఏమి ?

షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు అందరూ చూసే వార్షిక నివేదిక లేదా అన్యూవల్ రిపోర్ట్  అనగా ఏమి ?
వార్షిక నివేదిక లేదా అన్యూవల్ రిపోర్ట్  అనగా ఒక ఆర్ధిక సంవత్సరంలో  ఏదేని కంపెనీ  లేదా వ్యాపారం యొక్క  ఆదాయం, ఖర్చులు, ఆ  ఆర్ధిక సంవత్సరంలో  జరిగిన కొత్త ఒప్పందాలు , చేరుకున్న మైలు రాళ్ళు ,మేనేజ్మెంట్ లో మార్పులు చేర్పులు, ముఖ్యమైన సిబ్బంది మార్పులు చేర్పులు, భవిష్యత్తు ప్రణాళికలు  మొదలగునవి పొందుపర్చినటువంటి  నివేదిక . ఈ నివేదికను మేనేజ్మెంట్  రూపొందించి దానిని  షేర్  హోల్డర్స్, అంటే వాటా దారులకు, ప్రమోటర్లకు , వివిధ ప్రభుత్వ  విభాగాలకు , సెబీ కి,  అందచేస్తుంది.సాదారణ ప్రజానీకానికి మరియు  ఆ కంపెనీ లేదా వ్యాపారం పై ఆసక్తి ఉన్న వారందరికి అందుబాటులో ఉంటుంది. సాదారణంగా వార్షిక  నివేదిక ను   పుస్తక రూపంలో రూపొందిస్తారు. దానిలో చైర్మన్ సందేశం మొదలుకొని  భవిష్యత్తు  ప్రణాళికలు  ఉంటాయి.
సాధారణంగా వార్షిక నివేదిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నుండి వాటాదారులకు ఒక లేఖ అన్నమాట. దీనిలో  అందరూ  బోర్డు సభ్యులు, ఆడిటర్లు, సెక్రటరీ  మొదలగు వారీ  యొక్క ఫోన్  నంబర్లు ఒక జాబితా రూపంలో ఉంటాయి.తదుపరి పేజీలలో  బ్యాలెన్స్ షీట్ వంటి వివరణాత్మక ఆర్థిక నివేదికలు, ఆదాయ ప్రకటన, సహాయక షెడ్యూళ్లు సంస్థ కార్యకలాపాల మీద ఒక సాధారణ నివేదిక, ఒక స్వతంత్ర ఆడిటర్ యొక్క నివేదిక మొదలగునవి పొందుపరుస్తారు. అంతే కాకుండా కంపెనీ లో వివిధ వర్గాల వాటా ఏ విధంగా ఉంది మొదలగు వివరాలు
షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు అందరూ చూసే వార్షిక నివేదిక లేదా అన్యూవల్ రిపోర్ట్  అనగా ఏమి ?
వార్షిక నివేదిక లేదా అన్యూవల్ రిపోర్ట్  అనగా ఒక ఆర్ధిక సంవత్సరంలో  ఏదేని కంపెనీ  లేదా వ్యాపారం యొక్క  ఆదాయం, ఖర్చులు, ఆ  ఆర్ధిక సంవత్సరంలో  జరిగిన కొత్త ఒప్పందాలు , చేరుకున్న మైలు రాళ్ళు ,మేనేజ్మెంట్ లో మార్పులు చేర్పులు, ముఖ్యమైన సిబ్బంది మార్పులు చేర్పులు, భవిష్యత్తు ప్రణాళికలు  మొదలగునవి పొందుపర్చినటువంటి  నివేదిక . ఈ నివేదికను మేనేజ్మెంట్  రూపొందించి దానిని  షేర్  హోల్డర్స్, అంటే వాటా దారులకు, ప్రమోటర్లకు , వివిధ ప్రభుత్వ  విభాగాలకు , సెబీ కి,  అందచేస్తుంది.సాదారణ ప్రజానీకానికి మరియు  ఆ కంపెనీ లేదా వ్యాపారం పై ఆసక్తి ఉన్న వారందరికి అందుబాటులో ఉంటుంది. సాదారణంగా వార్షిక  నివేదిక ను   పుస్తక రూపంలో రూపొందిస్తారు. దానిలో చైర్మన్ సందేశం మొదలుకొని  భవిష్యత్తు  ప్రణాళికలు  ఉంటాయి.
సాధారణంగా వార్షిక నివేదిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నుండి వాటాదారులకు ఒక లేఖ అన్నమాట. దీనిలో  అందరూ  బోర్డు సభ్యులు, ఆడిటర్లు, సెక్రటరీ  మొదలగు వారీ  యొక్క ఫోన్  నంబర్లు ఒక జాబితా రూపంలో ఉంటాయి.తదుపరి పేజీలలో  బ్యాలెన్స్ షీట్ వంటి వివరణాత్మక ఆర్థిక నివేదికలు, ఆదాయ ప్రకటన, సహాయక షెడ్యూళ్లు సంస్థ కార్యకలాపాల మీద ఒక సాధారణ నివేదిక, ఒక స్వతంత్ర ఆడిటర్ యొక్క నివేదిక మొదలగునవి పొందుపరుస్తారు. అంతే కాకుండా కంపెనీ లో వివిధ వర్గాల వాటా ఏ విధంగా ఉంది మొదలగు వివరాలు ఉంటాయి. అంటే కంపెనీలో ఎవరేవ్వరికి ఎంత భాగస్వామ్య వాటా ఉంది అనే వివరాలు. కంపెనీ యొక్క షేరు ధర చరిత్ర మొత్తం అంటే షేరు యొక్క గరిష్ట , కనిష్ట ధరల వివరాలు ఉంటాయి. సంస్థ సాధించిన అన్ని మైలురాళ్ళు మరియు విజయాలు వివరిస్తూ చిత్రాలు మరియు గ్రాఫ్లు మొదలగునవి కూడా ఉంటాయి.
సాధారణంగా ఒక వార్షిక నివేదికలో  వ్యాపార అనుకూల అంశాలు ద్విగుణీకృతం చేస్తూ అంటే గొప్పగా చెప్తూ , ప్రతికూల అంశాలపై   తక్కువ శ్రద్ధ చూపెడతాయి.కాబట్టి,  మీరు చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా వార్షిక  నివేదికను చదవ వలసి ఉంటుంది. చైర్మన్ తన సందేశంలో పరోక్షంగా లక్ష్యాలు సాధించలేనందుకు  క్షమాపణలు కూడా చెప్పి ఉండవచ్చు. మీరు  గతంలో చెప్పిన భవిష్యత్ ప్రణాళికలు సాధించారా లేదా అని తెలుసుకోవడానికి గత ఆర్ధిక సంవత్సర వార్షిక నివేదికతో పోల్చి చూస్తే లక్ష్యాలు చేరుకున్నది లేనిది సులభంగా తెలిసిపోతుంది.  పూర్తిగా ఒక వార్షిక నివేదికను  చదివి అర్థం చేసుకోవాలి అంటే కొంత  నైపుణ్యం మరియు సహనం అవసరం అవుతుంది. మీరు  ఒక కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీరు ఆ వార్షిక నివేదిక ద్వారా ఆ సంస్థ యొక్క కార్యకలాపాలను మరింత  లోతుగా అర్ధం చేసుకోవడానికి సహాయ పడుతుంది.మీరు వార్షిక నివేదిక ద్వారా  క్రింది విషయాలపై ఒక అవగాహన కు రాగలుగుతారు.
Letter from the CEO
Summary of the operations-milestones, achievements, prospects.
Past Annual summary of all financial figures.
Management discussion and analysis of the performance of the company
The balance sheet
The income statement
Auditor’s report
Subsidiaries, brands, addresses, registered office, head quarters etc..
Names of directors
Stock price history
తదుపరి ఆర్టికల్ లో   వార్షిక నివేదిక లేదా అన్యూవల్ రిపోర్ట్  ఏ విధంగా చదవాలో తెలుసుకుందాం.

స్టాక్ మార్కెట్ విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు

స్టాక్ మార్కెట్ విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ,కొనుగోళ్లకు ప్రతిస్పందిస్తూ ఒడిదుడుకులకు లోనవుతుంటుంది.
విదేశీ ఇన్వెస్టర్లు షేర్లు కొనుగోలు చేసినపుడు సెన్సెక్స్ పెరగడం ,అమ్మకాలు జరిపినపుడు సెన్సెక్స్ పతనమవడం సర్వ సాధారణమే.
స్టాక్ మార్కెట్ లో ఈ ఊగిసలాట ధోరణి తరచుగా కన్పిస్తుంటుంది. మార్కెట్ పూర్తీ పతన దశలో వుండగా ఆదుకునేది విదేశీ  ఇన్వెస్టర్ లే.
అలాగే మార్కెట్ ని పతన దశలోకి నడిపిండేది వాళ్ళే. ఆరు ఏడేళ్ళుగా విదేశీ ఇన్వెస్టర్లు ఒక వ్యూహం ప్రకారం మార్కెట్ ని పెంచు కుంటూ వెళ్లారు .
వేల కోట్ల నిధులతో అత్యంత చౌ క ధరల్లో షేర్లను కొను గోలు చేసి  వాటి ధరలు తారా స్తాయికి చేరుకోగానే మరల నెమ్మదిగా అమ్మకాలు జరిపి అధ్బుతమైన  లాభాలు గడించారు.ఈ మొత్తం ప్రక్రియలో దేశీయ ఇన్వెస్టర్లు గడించింది తక్కువే.
దేశీయ ఇన్వెస్టర్లకు ఆర్ధిక సంస్తలకు నిర్దిష్టమైన వ్యూహం లేక పోవడం తో  లాభాల ఆర్జనలో విదేశీ ఇన్వెస్టర్ల తో పోలిస్తే వెనుక బడ్డారని చెప్పుకోవచ్చు

కాగా ఇప్పుడున్న పరిస్తితుల్లో మార్కెట్ మరింత దిగువకు వెళ్ళే అవకాశాలు తక్కువగానే వున్నాయి. మార్కెట్ అటు పడటం ఇటు వెంటనే మద్దతు దొరకటం జరుగుతోంది అయితే నవంబర్ ,డిసెంబర్ మాసాల్లో సహజం గా విదేశీ ఇన్వెస్టర్ల  కొనుగోళ్ళు  తక్కువగా వుంటాయి.కొత్త సంవత్సరం నేపధ్యం లో నిధుల   ఉపసంహరణ కూడా ఎక్కువగా వుంటుంది. ఈ క్రమం లో  మార్కెట్లో అమ్మకాల వొత్తిడి ఎక్కువగా వుంటుంది ఇలాంటి సమయం లో మార్కెట్ కొంత తగ్గుముఖం పట్టడం అనివార్యం. విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనక పోతే ఉత్తేజం లోపిస్తుంది. దీంతో షేర్ల ధరలు  కూడా తగ్గుతాయి. ఇలాంటి సందర్భాన్నే ఇన్వెస్టర్లు తెలివిగా వాడుకోవాలి. 
మంచి షేర్లు తక్కువ ధరల్లో దొరికితే కొనుగోలు చేయాలి .సెన్సెక్స్ కనిష్ట స్తాయిలో వున్నపుడు కొనుగోళ్ళు చేస్తే మార్కెట్ పెరిగినపుడు లాభాలు ఆర్జించే అవకాశాలు వుంటాయి. .
 అయితే ఇన్వెస్టర్లకు ఒక సందేహం కలగవచ్చు.కనిష్ట స్తాయి నుంచి మార్కెట్ మళ్లీ పెరుగుతుందా అన్న అనుమానం కలగ వచ్చు . కానీ ఇన్వెస్టర్లుఅలాంటిసందేహాలు  పెట్టు కోవలసిన అవసేరం లేదు.విదేశీ ఇన్వెస్టర్లు జనవరి మాసం లో మళ్ళీ పెట్టుబడులు పెట్టడం ఖాయం .భారత్ మార్కెట్ల లో లభించే అంత చౌకగా మరే దేశం లో షేర్లు చౌక ధరల్లో లభించవు.అలాగే భారత్ లాగా  పెట్టుబడులకు అనుకూలమైన దేశం మరొకటి లేదు .భారత్ దేశం బహుముఖం గా వృద్ధి సాధిస్తోంది. దేశీయం గ కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి లేదు. ఈ కారణం గా  విదేశీ పెట్టు బడులు 
తరలిరావడం ఖాయం  అని విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి ఏ కారణాల వల్ల అయినా  తాత్కాలికం గా మార్కెట్   డౌన్  ట్రెండ్ లో పడినా ఇన్వెస్టర్లు కంగారు పడాల్సిన అవసరం లేదు. మార్కెట్ తగ్గే కొద్ది  మంచి షేర్లను ఎంచు కొని  ఇన్వెస్ట్ చేయడం  మంచిది.

పసందైన లాభాలకు పది హేను సూత్రాలు

స్టాక్ మార్కెట్ లో లాభాలు అర్జించాలంటే  ఇన్వెస్టర్లు  ఈ దిగువ నిచ్చిన సూత్రాలను పాటించాలి. లాభాలు రాకపోయినా  నష్టాల పాలవ కుండా సేఫ్ గా ఉండొచ్చు.
*   అందరు షేర్లను అమ్ముకుంటున్న సమయం లో  కొనుగోళ్ళు చేయాలి
*  మనసు ప్రశాంతం గా వున్నపుడు మాత్రమే ఇన్వెస్ట్ మెంట్  నిర్ణయాలు తీసుకోండి
*  ఎవరు పడితే వారిచ్చే టిప్స్ ను అనుసరించ కూడదు
* మంచి షేర్లలో చౌక ధర కు దొరికే వాటిపైనే  గురి  పెట్టాలి  ... మంచి షేర్లలో కూడా నూటికి నూరు పాళ్ళు  బెస్ట్  షేర్ ఏది ఉండ దని గుర్తుంచుకోవాలి
* మార్కెట్ పడే తరుణం లో షేర్లను కొనుగోలు చేయమని సలహాలు ఇవ్వడం చాల సులభం.

    కాని కొనడమే కష్టం .ధైర్యం చాలదు. కానీ ధైర్యం చేయక తప్పదు
*కేవలం టిప్స్ ఆధారం గానే షేర్లను కొనగూడదు. కొంత  మేరకైనా స్వీయ విశ్లేషణ వుండాలి.
 * షేర్లలో మదుపు చేసి  సైలెంట్ గా  ఉండ కూడదు
* ఇన్వెస్ట్ చేసే ముందు కంపెనీల మంచి చెడ్డ ల గురించి తెలుసు కోవాలి
* మార్కెట్ పోకడ తో నిమిత్తం లేకుండా కొన్ని షేర్లు పెరుగు తుంటాయి . కొన్ని తగ్గు తుంటాయి .పెరిగే వాటిలో మంచి వాటిని  ఎంపిక చేసుకోవాలి
* ఒకే కంపెనీ లేక ఒకే  గ్రూపు కి చెందినా కంపెనీల షేర్లలో మొత్తం సొమ్మును ను మదుపు చేయకూడదు ,
     భిన్న రంగాలకు చెందిన కంపెనీల  షేర్లను  ఎంపిక చేసుకోవాలి
* కొనుగోలు చేసిన షేర్ల కదలిక లను నిత్యం పరిశీలిస్తుండాలి,  కంపెనీల తాలుకు బోనస్,డివిడెండ్,ఇతర సమాచారాన్ని కూడా తెలుసు కుంటుండాలి
* షేర్లను ప్రేమించ కూడదు. ధర  పెరిగితే  వెంటనే స్పందించి అమ్మేసుకోవాలి
* ధరలు పతన మయ్యే తరుణం లో బెంబేలెత్తి పోకూడదు , ఓర్పు వహించాలి. చేతిలో సొమ్ము వుంటే మరిన్ని మంచి షేర్లను కొనాలి .ఇది కూడా అంత సులభమైన విషయం కాదు
* మార్కెట్ ఏ కారణాల వాళ్ళ పతనమైనా కొన్నాళ్ళకు పెరుగుతుంది.  ఇన్వెస్టర్లు ఎపుడు ఆశ భావం తో  ఉండాలి
 

* ఇన్వెస్టర్లు మరీ ఆశ బోతులుగా ఉండ కూడదు, దశలు వారీ గా లాభాలు గడించాలి అన్న దృక్పధం తో  మదుపు చేయాలి

క్యాష్ ఫ్లో కంపెనీలపై కన్నేయండి

క్యాష్ ఫ్లో కంపెనీలపై కన్నేయండి

షేర్లలో మదుపు చేసి లాభాలు అర్జించాలంటే క్యాష్ ఫ్లో కంపెనీలను ఎంచుకోవాలి. అన్ని కంపెనీలలో ఫ్రీ క్యాష్ ఫ్లో వుండదు.అసలు ఫ్రీ క్యాష్ ఫ్లో అనే పదాన్ని చాలామంది ఇన్వెస్టర్లు విని వుండరు.ఆస్తులలో ఇన్వెస్ట్మెంట్, ఎక్విప్మెంట్  ,ప్లాంట్ కొనుగోలు వంటివి కాపిటల్ వ్యయానికి పోగా మిగిలిన నగదునే ఫ్రీ క్యాష్ ఫ్లో అంటారు.ఇలాంటి నగదు నిల్వలు చాల కంపెనీలలో వుంటాయి .కొన్ని కంపెనీలలో భారీ గా వుంటాయి.భవిష్యత్ అవసరాల కోసం ఈ నగదు నిల్వలను ఉపయోగిస్తుంటారు. కంపెని ఆర్ధిక పరిస్తితిలో మార్పు వచ్చిన సందర్భం లో ఈ నగదు నిల్వలే ఆదుకుంటాయి.అలాగే కంపెనీలు ఉన్నత స్తాయికి ఎదగాలంటే భారీ గా నిధుల అవసరం వుంటుంది . భవిష్యత్ అవసరాల కోసమే గాక డివిడెండ్  చెల్లింపులకు  నిధుల అవసరం వుంటుంది.   కేవలం క్యాష్ ఫ్లో చరిత్ర నే కాకుండా డివిడెండ్ ను కంపెనీ చెల్లిస్తుందా లేదా అనే అంశం కూడా పరిగణన  లోకి తీసుకొని షేర్లలో మదుపు చేయాలి.మార్కెట్లో షేర్ ధర వృద్ధి  తో సంబంధం లేకుండా కంపెనీ పని తీరు ఫలితాల పై ఆధారపడి రాబడులు అందుకోవచ్చు.చాల మంది ఇన్వెస్టర్లు ఈ విషయాన్నీ నిర్లక్ష్యం చేస్తుంటారు షేర్ ధర పెరుగుదల పైనే దృష్టి . ముఖ్యం గా దీర్ఘ కాలిక వ్యూహం తో మదుపు చేసే ఇన్వెస్టర్లు క్యాష్ ఫ్లో కంపెనీ లపైన కన్నేయ వచ్చు.
ఇటు ఫ్రీ క్
షేర్లలో మదుపు చేసి లాభాలు అర్జించాలంటే క్యాష్ ఫ్లో కంపెనీలను ఎంచుకోవాలి. అన్ని కంపెనీలలో ఫ్రీ క్యాష్ ఫ్లో వుండదు.అసలు ఫ్రీ క్యాష్ ఫ్లో అనే పదాన్ని చాలామంది ఇన్వెస్టర్లు విని వుండరు.ఆస్తులలో ఇన్వెస్ట్మెంట్, ఎక్విప్మెంట్  ,ప్లాంట్ కొనుగోలు వంటివి కాపిటల్ వ్యయానికి పోగా మిగిలిన నగదునే ఫ్రీ క్యాష్ ఫ్లో అంటారు.ఇలాంటి నగదు నిల్వలు చాల కంపెనీలలో వుంటాయి .కొన్ని కంపెనీలలో భారీ గా వుంటాయి.భవిష్యత్ అవసరాల కోసం ఈ నగదు నిల్వలను ఉపయోగిస్తుంటారు. కంపెని ఆర్ధిక పరిస్తితిలో మార్పు వచ్చిన సందర్భం లో ఈ నగదు నిల్వలే ఆదుకుంటాయి.అలాగే కంపెనీలు ఉన్నత స్తాయికి ఎదగాలంటే భారీ గా నిధుల అవసరం వుంటుంది . భవిష్యత్ అవసరాల కోసమే గాక డివిడెండ్  చెల్లింపులకు  నిధుల అవసరం వుంటుంది.   కేవలం క్యాష్ ఫ్లో చరిత్ర నే కాకుండా డివిడెండ్ ను కంపెనీ చెల్లిస్తుందా లేదా అనే అంశం కూడా పరిగణన  లోకి తీసుకొని షేర్లలో మదుపు చేయాలి.మార్కెట్లో షేర్ ధర వృద్ధి  తో సంబంధం లేకుండా కంపెనీ పని తీరు ఫలితాల పై ఆధారపడి రాబడులు అందుకోవచ్చు.చాల మంది ఇన్వెస్టర్లు ఈ విషయాన్నీ నిర్లక్ష్యం చేస్తుంటారు షేర్ ధర పెరుగుదల పైనే దృష్టి పెడతారు. ముఖ్యం గా దీర్ఘ కాలిక వ్యూహం తో మదుపు చేసే ఇన్వెస్టర్లు క్యాష్ ఫ్లో కంపెనీ లపైన కన్నేయ వచ్చు.
ఇటు ఫ్రీ క్యాష్ ఫ్లో ను కలిగి మరో వైపు ఆకర్షనీయమైన డివిడెండ్ ను చెల్లించే  కంపెనీలు ఎన్నో వున్నాయి.
అలాంటి వాటిని ఇన్వెస్టర్లు ఎంచుకుంటే  పెట్టుబడికి  రిస్క్ వుండదు .మార్కెట్లో  షేర్ ధరలు  హెచ్చు తగ్గులకు  గురైనప్పటికీ క్యాష్ రిచ్ కంపెనీల షేర్లను ఎంచుకుంటే  డివిడెండ్ పరం గా ఆదాయం పొందవచ్చు .అలాగే మార్కెట్ సెంటిమెంట్ బాగుంటే షేర్ ధరలు పెరిగిన సందర్భం లో పాక్షిక లాభాలు పొందవచ్చు.కాబట్టి ఇన్వెస్టర్లు షేర్లను ఎంచు కొనే ముందు ఆయ కంపెనీల పూర్వ పరాలను పరిశీలించాలి.ఆయ కంపెనీలు క్యాష్ రిచ్ కంపెనీలో కాదో తెలుసుకోవాలి.ఈ విషయాలు తెలుసు కోవాలంటే , కొంత కసరత్తు చేయాలి. కంపెనీ చరిత్ర ను మొత్తం చదివితే వాస్తవాలు తెలుస్తాయి.
ఆ తర్వాతే మంచి క్యాష్ రిచ్ కంపెనీ షేర్లను ఎంచు కొని మదుపు చేయాలి.
 
ఫ్రీ క్యాష్ ఫ్లో కంపెనీలలో ఓ ఎన్ జీ  సీ,ఐ  ఓ సీ ,హిందూస్తాన్ లీవర్,ఇన్ఫోసిస్ ,హీరో హోండా ,ర్యాన్ బాక్సి,గెయిల్,విప్రో,హిండాల్కో ,అశోక లేలాండ్ , ఎల్ అండ్ టీ,ఎన్ ఏం డీసీ,టీ సీ ఎస్, కోల్ ఇండియా , టాటా స్టీల్ వున్నాయి .

ధరలు తగ్గాయని షేర్లు కొనవద్దు

కార్పొరేట్ కంపెనీలు పేలవమైన ఫలితాలు ప్రకటించడం, వృద్ధిరేటు క్షీణించడం, పెరుగుతున్న ద్రవ్యలోటు, అధిక ద్రవ్యోల్బణం ,అనూహ్యంగా డాలరుతో రూపాయి మారకం విలువ క్షీణించడం వంటి పరిస్థితుల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు ఉరకలేయడం లేదు.మధ్యలో రిలీఫ్ రాల్యిస్ వచ్చినా విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్లో మదుపు చేయడానికి అంత ఆసక్తి చూపడం లేదు.ఆర్థిక వ్యవస్థపై స్పష్టత వచ్చాకే తిరిగి  విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున మదుపు చేసే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు.అయితే ఇదే సమయంలో దేశీయ మ్యూచువల్ ఫండ్స్ కొనుగోళ్లు జరుపుతున్నా వాటి ప్రభావం మార్కెట్ పై తక్కువే. ప్రస్తుతం చాలా షేర్లు తక్కువ రేట్ల వద్ద ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయవచ్చా? అని చాల మంది ఇన్వెస్టర్లకు సందేహం కలగవచ్చు.ఆల్‌టైమ్ కనిష్టస్థాయికి చేరిన షేర్లు మరింత క్షీణించే అవకాశముంది. కాబట్టి షేరు ధరను చూసి కొనడమనేది చాలా ప్రమాదకరం. అలా చేస్తే చేతులు కాలడం ఖాయం. ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే తక్కువ పీఈ ఉన్న కన్సూమర్ డ్యూరబుల్ రంగానికి చెందిన షేర్లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే పీఎస్‌యూ బ్యాంకులు, రియల్ ఎస్టేట్ రంగాలకు అంతగా ప్రమాదమేమీ లేదు. రుణభారం అధికంగా ఉన్న కంపెనీల షేర్లకు దూరంగా ఉండటం మంచిది అని విశ్లేషకులు  చెబుతున్నారు.

Portfolio

పోర్ట్ ఫోలియో ఏర్పాటుకు ఇదే అదను

ఇన్వెస్టర్లు కొత్త పోర్ట్ ఫోలియో  ఏర్పాటు చేసుకోవడానికి ఇది మంచి సమయం.
మార్కెట్ 15000పాయింట్ల వద్దనే  ఊగిస లాడుతోంది.దీర్ఘ కాలిక లక్ష్యం తో
మంచి షేర్లను ఎంచుకొని మదుపు చేస్తే భవిష్యత్ లో లాభాలు అందుకునే అవకాశాలు
పుష్కలం గా వున్నాయి. ఇప్పటికే పలు మంచి కంపెనీల షేర్లు చౌక ధరల వద్ద  ట్రేడ్
అవుతున్నాయి . ప్రస్తుత దశలో మార్కెట్ ఒడిదుడుకులకు తట్టుకుంటూ
స్వల్పం గా నష్ట పోతూ ,మంచి పని తీరుతో  దూసుకు పోతున్న కంపెనీల షేర్లను
ఎంచుకుని  పరిశీలించండి. ఇందు కోసం కొంత అధ్యయనం  చేస్తే మరీ మంచిది.
స్టాక్ మార్కెట్ లో పెట్టు బడి పెట్టాలని ఉబలాట పడే కొత్త ఇన్వెస్టర్లు కూడా 
పోర్ట్ ఫోలియో గురించి తెలుసుకుంటే మేలు.
పోర్ట్ ఫోలియో అంటే  పలు రకాలైన షేర్లను కలిగి ఉండటమే.పెట్టుబడి మొత్తాన్ని
వివిధ రంగాలకు చెందిన షేర్ లకు పంచి  ఆయ షేర్ల ద్వారా వచ్చే లాభ నష్టాలను
బ్యాలన్సు చేసుకోవడాన్నే  పోర్ట్ ఫోలియో నిర్వహణ అంటారు .కాగా షేర్లలో రిస్క్
తగ్గించుకోవడానికి ఏకైక మార్గం పోర్ట్ ఫోలియో ను సక్రమం గా నిర్వహించుకోవడమే .
పోర్ట్ ఫోలియో లో 5నించి 10షేర్లు వుండాలి .10 కన్నా ఎక్కువ షేర్లు మంచిది కాదని
నిపుణుల అభిప్రాయం . ఇన్వెస్టర్ల స్తోమత ను బట్టి  రెండు, మూడు పోర్ట్ ఫోలియో లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.
అయితే  అందుకు తగిన నిర్వహణ సామర్ద్యం వుండాలి.
స్టాక్ మార్కెట్ ద్వారా స్తిరమైన లాభాలు ఆర్జించ గోరే వారు పోర్ట్ ఫోలియో ను
నిర్వహించడమే మేలు .అవసర మైన  సందర్భాలలో  ఈ పోర్ట్ ఫోలియో ను మారుస్తుండాలి .
మార్చాలనుకుంటే మూడు నెలల కాలాన్ని లక్ష్యం గా పెట్టుకుని క్రమం గా మార్చాలి .
లేక పోతే రిస్క్ పెరిగి పోతుంది. అలా అని  పోర్ట్ ఫోలియో ను పదే పదే మార్చడం కూడా మంచిది కాదు.
అయితే షేర్ల ధరలను మాత్రం తరచుగా సమీక్షిస్తుండాలి .అప్పుడే మనకు లాభాలు వస్తున్నాయా?
నష్టాలు వస్తున్నాయా అనేది  అపుడే తెలుస్తుంది .
మార్కెట్ డౌన్ ట్రెండ్ లో వున్నపుడు మంచి షేర్లు కనిష్ట  ధరల వద్ద లభిస్తుంటాయి.
కాబట్టి ఆలాంటి సమయం లో పోర్ట్ ఫోలియో లో మంచి షేర్లను పెట్టుకోవాలి .
పోర్ట్ ఫోలియో లో ఎపుడు ఒకే పరిశ్రమ కు సంబంధిన షేర్లను ఉంచు కోవడం ప్రమాదం.
ఆ పరిశ్రమ సెంటిమెంట్ బలహీన పడినపుడు షేర్ల ధరలు తగ్గుముఖం పడతాయి .
అపుడు  నష్ట పోయే అవకాసం వుంది . కాబట్టి వేర్వేరు పరిశ్రమ లకు చెందిన షేర్లను ఎంపిక చేసుకోవడం మంచిది.
ప్రస్తుతం మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పటికీ  జనవరి తర్వాత విదేశీ ఇన్వెస్టర్ల  కొనుగోళ్ళు మళ్ళీ ఊపందుకోవచ్చు.
కొన్ని ప్రతి కూల అంశాలు ఉన్నప్పటికీ  ప్రపంచ మార్కెట్లలో భారత్  మార్కెట్లే  ఆకర్షనీయం వున్నాయి. ఈ నేపధ్యం లో మార్కెట్లు సమీప భవిష్యత్ లో పుంజుకునే సూచనలు లేక పోలేదు .కాబట్టి  ఇన్వెస్ట్ మెంట్ కి ఇదే సరైన తరుణం.

RAJIV GANDHI EQUITY SAVINGS SCHEME (RGESS)

 స్టాక్ మార్కెట్లో చిన్న ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టడానికి అవకాశం కల్పించే రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్ స్కీమ్
RAJIV GANDHI EQUITY SAVINGS SCHEME (RGESS)
కేంద్ర ఆర్ధిక మంత్రి  కొత్త గా ఆదాయపు  పన్ను పథకాన్ని 21 sep 2012నాడు ఆమోదించడం జరిగినది. ఆ పథకం పేరే  రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్ స్కీమ్. ఈ పథకం ప్రకారం కొత్తగా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే రిటైల్ ఇన్వెస్టర్లు ఆదాయపు పన్నుమినహాయింపు  పొందడానికి ఉపయోగపడుతుంది. వార్షిక ఆదాయం పది లక్షల లోపు ఉండి, తొలిసారిగా స్టాక్ మార్కెట్ లో యాభై వేలు ఇన్వెస్ట్ చేస్తారో  వారూ ఈ పథకం ద్వారా ఆదాయపు పన్ను మినహాయింపు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం దేశీయ స్టాక్ మార్కెట్ లో కి ఇన్వెస్టర్లను ఇన్వెస్ట్ చేయడానికి ప్రోత్సహించడం  , దేశంలో  ఈక్విటీ సంస్కృతి' పెరిగేలా చూడటం.ఈ పథకం యొక్క ముఖ్యమైన లక్షణాలను ఒక్క సారి పరిశీలిద్దాం.
ఈ పథకం కొత్తగా మార్కెట్ లో కి ప్రవేశించే వారి కోసం ఉద్దేశించిన పథకం.వారిని వారి పాన్ నంబర్ ఆధారంగా గుర్తిస్తారు.ఎవరైనా ఇప్పటికే డిమ్యాట్ ఖాతా ప్రారంభించి ఎలాంటి లావాదేవీలు జరపకపోతే వారూ కూడా ఈ పథకం క్రింద ఇన్వెస్ట్ చేయవచ్చు.
పన్ను పరిధిలోకి వచ్చే వార్షిక ఆదాయం పది లక్షల కంటే తక్కువగా ఉంటుందో వారూ ఈ పథకం ద్వారా ఇన్వెస్ట్ చేయడానికి అర్హులు.
ఈ పథకం క్రింద గరిష్టంగా రూ 50,000 పెట్టుబడి పెట్టడానికి అవకాశం కలదు. ఇన్వెస్ట్ చేసిన మొత్తం లో    50% అమౌంట్ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుండి మినహాయింపు పొందుతారు.
ఈ పథకం క్రింద ఇన్వెస్ట్ చేయడానికి  BSE 100,  CNX100 లో ఉన్న కంపెనీలలో  , ప్రభుత్వ రంగసంస్థలలో   నవరత్న , మహానవరత్న, మినీ నవరత్న హోదా కలిగిన కంపెనీలు , పైన  పేర్కొనబడిన కంపెనీలలో ఫాలో అన్ పబ్లిక్ ఇష్యూ (   FPOs)లలో ,ప్రభుత్వరంగ కంపెనీలు  IPOకి వచ్చినప్పుడు ఆ ఆర్ధిక సంవత్సరం కంటే ముందు మూడు సంవత్సరాలు వరుసగా   4,000  కోట్ల కంటే అధిక టర్నోవర్ కలిగి ఉన్న కంపెనీలలో ఇన్వెస్ట్ చేయవచ్చు.అంటే ఏ కంపెనీలలో పడితే ఆ కంపెనీలలో ఇన్వెస్ట్ చేయడం వలన ఈ పథకం యొక్క లాభాలు కలగవు.
వివిధ వర్గాల నుండి వచ్చిన అభ్యర్థన మేరకు   Exchange Traded Funds (ETFs) , Mutual Funds (MFs) ఈ పథకం క్రింద పేర్కొనబడిన కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తాయో వాటిని కూడా ఈ పథకం క్రింద పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది.
చిన్న ఇన్వెస్టర్లకు , ప్రయోజనం కల్పించడానికి ఈ పథకంలో వాయిదా పద్దతిలో ఇన్వెస్ట్ చేయడానికి కూడా అవకాశం కలిపించడం జరిగినది.పన్ను ప్రయోజనాలు పొండుతున్న ఆర్ధిక సంవత్సరం లోనే ఇన్వెస్ట్ చేయాలి.
ఈ పథకం యొక్క లాక్ ఇన్ పిరియడ్ మూడు సంవత్సరములు. మీరు చివరిసారిగా ఇన్వెస్ట్ చేసిన తేది నుండి పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది..  
ఇన్వెస్ట్ చేసిన సంవత్సరం తరవాత  ఇన్వెస్ట్ చేసిన షేర్లలో ట్రేడింగ్ చేయడానికి అవకాశం కల్పించబడుతుంది.
మీరు ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఈ పథకంలో గల ఒక కంపెనీ  షేర్లు అమ్మినట్టు ఐతే మీరు అంతే విలువగల ఈ పథకంలో అనుమతి ఇవ్వబడిన మరో కంపెనీ షేర్లు కొనవలసి ఉంటుంది.
ఈ పథకం క్రింద ఆదాయపు పన్ను మినహాయింపు పొందడానికి   ఆదాయపు పన్ను సెక్షన్ 80CCG ను చేర్చడం జరిగినది.

కేంద్ర రెవిన్యూ డిపార్ట్ మెంట్ మరియు సెబీ రాబోవు రెండు వారాలలో  పూర్తీ వివరాలతో కూడిన సర్క్యులర్  ఇవ్వగలవు